New Ration Cards : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతం..

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గూడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం త్వరలో ప్రారంభంచేయనుంది. దీని కోసం లక్షల కుటుంబాలు ఎదురు చేస్తున్నాయి. కాగా ఈనెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. మీ-సేవ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిసింది. అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యం వంటి నిత్యవసర రసుకులు కాకుండానే ఆరోగ్యశ్రీ వంటి పలు పథకాలకూ కూడా రేషన్ కార్డులో చేర్చనున్నారు.

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకం కింద ఆరోగ్యశ్రీ పరిమితిని ఇటీవలే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. అర్హత కలిగినప్పటికీ అనేక కుటుంబాలు రేషన్‌ కార్డుల్లేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి పొందలేకపోతున్నాయి. అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేశాక వీటి పరిశీలన ఉంటుంది. అర్హుల ఎంపిక ప్రక్రియ గ్రామాల్లో గ్రామసభలు.. నగరాలు, పట్టణాల్లో బస్తీసభల ద్వారా జరుగుతుందని పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లై అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలిసింది.

రాష్ట్రంలో రేషన్ కార్డులు మార్పు అనేది నిర్విరామ ప్రక్రియ.. ఎందుకంటే.. ఒక కుటుంబంలో ఐదుగురు ఉంటే అందులో ఒక అమ్మయికి పెళ్లై వెళ్లిపోతుంది. మరో విధంగా.. ఆ ఫ్యామిలీలో వృద్ధురాలు ఉంటే వారు వయసు పైబడి మరణిస్తూ ఉంటారు. ఇలా కుటుంబంలో తగ్గుతున్న వ్యక్తుల పేర్లను ఈ రేషన్ కార్డు నుంచి అధికారికంగా తోలగించాలి. అదే విధంగా ఫ్యామిలీ లోకి వచ్చిన వారిని, కొత్తగా చిన్నారుల పేర్లు రేషన్ కార్డులో చేర్చుకోవాలి ఇలా ఈ ప్రక్రియ జీవితాంతం జరుగుతునే ఉంటుంది. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం 6,47,297 కొత్త రేషన్‌కార్డులు జారీచేసినట్లు అధికార గణంకాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 2.82 కోట్ల మందికి పైగా రేషన్‌ లబ్ధిదారులు ఉన్నారు.

ప్రస్తుతం రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తీకీ 6 కిలో చొప్పున బియ్యం అందుతున్నాయి. హైదరాబాద్ లో గోధుమలు కూడా ఇస్తున్నారు. గతంలో కిలో బియ్యం రూపాయికే ఇవ్వగా.. కొవిడ్‌ నేపథ్యంలో మూడేళ్లుగా ప్రజలకు ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు. అన్నపూర్ణ అంత్యోదయ యోజన కార్డులు ఉన్నవారికి నెలకు కిలో చక్కెర కూడా ఇస్తున్నారు.