Uttarakhand : మరి కొన్ని గంటల్లో శుభవార్త.. నేడు బయటికి రానున్న ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కకున్న 41 కార్మికులు..

ఈ సొరంగ ప్రమాదంలో 41 మంది కార్మికులు చిక్కిపోయి బాహ్య ప్రపంచంతో తమ సంబంధాలు తెలిపోయాయి. వారిని రక్షించేందుకు భారత రక్షణ వ్యవస్థ కాకుండా.. అంతర్జాతీయ రక్షణ వ్యవస్థ కూడా తీవ్ర ప్రయాత్నాలు జరగుతున్నాయి. ఎట్టకేలకు నేడు ఆ ప్రయాత్నాలు ఫలిచేలా ఉన్నాయి.

ఉత్తరాఖండ్ .. గత 11 రోజులుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బ్రహ్మఖల్-యమునోత్రి హైవేపై నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్‌లో కొంత భాగం నవంబర్ 12న కూలిపోయిన విషయం తెలిసిందే.. చార్‌ ధామ్ యాత్ర ప్రాజెక్ట్ కింద, బ్రహ్మఖల్- యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా- దండల్‌గావ్ మధ్య ఈ సొరంగం నిర్మితమవుతోంది. ఈ సొరంగ ప్రమాదంలో 41 మంది కార్మికులు చిక్కిపోయి బాహ్య ప్రపంచంతో తమ సంబంధాలు తెలిపోయాయి. వారిని రక్షించేందుకు భారత రక్షణ వ్యవస్థ కాకుండా.. అంతర్జాతీయ రక్షణ వ్యవస్థ కూడా తీవ్ర ప్రయాత్నాలు జరగుతున్నాయి. ఎట్టకేలకు నేడు ఆ ప్రయాత్నాలు ఫలిచేలా ఉన్నాయి.

Uttarakhand Uttarkashi : సొరంగంలో 41 మంది కార్మికులు.. ఆహారంగా కిచిడీ పంపిన అధికారులు

ఉత్తరాఖండ్‌ సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41 మంది కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు నిర్విరమంగా రెస్క్యూ టీం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో వారు కార్మికుల ఉన్న ప్రాంతానికి చేరుకునేందుకు మంగళవారం రాత్రి నుంచి అమెరికన్‌ ఆగర్‌ యంత్రంతో చేపట్టిన పనులు ఏకధాటిగా కొనసాగుతున్నాయి. 800 మి.మీ. వ్యాసార్ధం ఉన్న స్టీలుపైపులను భూమికి సమాంతరంగా శిథిలాల ద్వారా 45 మీటర్ల మేర విజయవంతంగా ప్రవేశ పెట్టగలిగారు. ఇంకా 12 మీటర్ల సొరంగం డ్రిల్లింగ్ మాత్రమే మిగిలి ఉంది. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ రెస్క్యూ మెషిన్ ఒకటి, రెండు గంటల్లో ఈ ఆపరేషన్ పూర్తవుతుంది. నిజానికి ఈ రెస్క్యూ ప్రణాళికలో భాగంగా శిథిలాలకు రెండోవైపున్న బార్కోట్‌ నుంచి కూడా 8 మీటర్ల వరకు తవ్వకాలు పూర్తిచేశారు. దీనికోసం మూడు సార్లు పేలుళ్లు నిర్వహించారు అధికారులు. నిజానికి అటువైపు నుంచి చేరుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ముందుజాగ్రత్తగా రెండు వైపులా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీతో ప్రధాని మోదీ మరోసారి ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు.

Uttarakhand : ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సొరంగం..

ఏలగైన ఈ రోజు కార్మికులు భాహ్య ప్రపంచలోకి వస్తారు అని ధీమ వ్యక్తం చేస్తు.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెలిప్యాడ్ వద్ద 15 మంది వైద్యులతో.. 41 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి అంబులెన్స్‌లలో వైద్యుల బృందం సిద్ధంగా ఉంది. మరో వైపు ఉత్తరా కాశీ లోని అన్ని ఆసుపత్రులలో పాటు ఎయిమ్స్, రిషికేష్ పట్నంలో ఆసుపత్రులను హై అలర్ట్ చేసిన ఆసుపత్రి సిబ్బంది వైద్యులు అందుబాటులో ఉండాలని ఉత్తరాఖండ్ సీఎంవో ఆదేశాలు జారీ చేసింది.
పనులను పర్యవేక్షించేందుకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. 11వ రోజు చేరుకున్న ఈ రెస్క్యూ మిషన్‌ పనులు అటంకాలు కలుగుతు.. కొనసాగుతున్నాయి.

ఇక రెస్క్యూ పనులు సాజావుగా సాగుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణాశాఖ అదనపు కార్యదర్శి మహమూద్‌ అహ్మద్‌ చెప్పారు. మధ్యలో ఎలాంటి అవాంతరాలు రాకుంటే కొన్ని గంటల్లోనే శుభవార్త వింటామని ఆశాభావం వ్యక్తంచేశారు.