గుడ్ న్యూస్: మద్యం పాలసీ వచ్చేస్తోంది

ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీ ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్దం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు లేదా రేపటి లోగా నూతన మద్యం పాలసీని విడుదల చేయాలని ప్రభుత్వం సిద్దమవుతోంది.

  • Written By:
  • Publish Date - September 30, 2024 / 09:48 AM IST

ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీ ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్దం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు లేదా రేపటి లోగా నూతన మద్యం పాలసీని విడుదల చేయాలని ప్రభుత్వం సిద్దమవుతోంది. మద్యం వ్యాపారాన్ని రిటైల్ వ్యాపారానికి ప్రైవేటుకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ను ఫారిన్ లిక్కర్.. చట్టాన్ని సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ఇప్పటికే ను సిద్దం చేసింది సర్కార్.

ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో ఇవాళ విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవాళ రేపట్లో నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్లు స్వీకరిస్తారు. లాటరీ ఎంపికపై తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 10, 11న లైసెన్సులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.