ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాడు. కొత్త తరం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. రిటైర్మెంట్ ప్రకటించినందుకు బాధగా లేదన్న మొయిన్ అలీ ఇప్పటికే చాలా క్రికెట్ ఆడేసానని చెప్పుకొచ్చాడు. ఇటీవల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ జరిగిన మ్యాచ్ అలీ కెరీర్ లో చివరిది. మున్ముందు జాతీయ జట్టులో చోటు దక్కడంపై స్పష్టత లేకపోవడంతోనే గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. 2014లో అంతర్జాతీయ క్రికెట్‌ను ఆరంభించిన మొయిన్ అలీ 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 6,678 పరుగులు చేశాడు. 8 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక బౌలింగ్‌లో 366 వికెట్లు పడగొట్టాడు.