ఆ బాధ్యతలకు గుడ్ బై, సంజూ సంచలన నిర్ణయం

రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే సీజన్‌లో వికెట్ కీపింగ్ బాధ్యతను వదిలేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజ్‌మెంట్ మరియు అతని సహచరుడు ధృవ్ జురెల్‌తో చర్చించిన తర్వాత సంజూ శాంసన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

  • Written By:
  • Publish Date - December 23, 2024 / 09:35 PM IST

రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే సీజన్‌లో వికెట్ కీపింగ్ బాధ్యతను వదిలేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజ్‌మెంట్ మరియు అతని సహచరుడు ధృవ్ జురెల్‌తో చర్చించిన తర్వాత సంజూ శాంసన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానెల్‌లో సంజూ శాంసన్ మాట్లాడుతూ వచ్చే ఐపీఎల్ లో వికెట్ కీపింగ్ బాధ్యతను వదులుకుంటానని చెప్పాడు. ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతను స్వీకరిస్తాడని ఇది అతని కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాడు.

ధృవ్ జురెల్ టెస్ట్ వికెట్ కీపర్‌గా రాణిస్తున్నాడని అయితే ఐపిఎల్‌లో కూడా వికెట్ కీపింగ్ చేయడం ద్వారా ధృవ్ కు ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుందని చెప్పాడు. నేను కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఎప్పుడు ఫీల్డింగ్ చేయలేదని, అయితే వచ్చే ఐపీఎల్ లో అది జరుగుతుందన్నాడు. దీంతో అది కాస్త సవాలుగానే ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే నేను ధృవ్ తో మాట్లాడానని సంజు చెప్పాడు. అయితే అన్ని మ్యాచ్ లకు ఈ మార్పు లేకపోయినా కొన్ని మ్యాచ్ లకు ధృవ్ కీపర్ గా ఉంటాడని చెప్పాడు సంజు శాంసన్.

అంతేకాదు తాజా యూట్యూబ్ డిస్కషన్ లో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఆర్ఆర్ ఎందుకు కొనుగోలు చేసిందో కూడా చెప్పాడు. ఫ్రాంచైజీ తనలో ఏదో ప్రత్యేకతను చూసింది. దాని కారణంగానే అతని కోసం 1.10 కోట్లు ఖర్చు చేసింది. యువ ప్రతిభ వంతులకు అవకాశం కల్పించడం కోసం రాజస్థాన్ ఈ నిర్ణయం తీసుకుందన్నాడు. రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ మరియు ధృవ్ జురెల్ దీనికి ఉదాహరణలని సంజూ చెప్పాడు. మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసిన తర్వాత మిగతా ఆటగాళ్లను వేలంలో దక్కించుకుంది. కాగా ఆర్ఆర్ సంజూ శాంసన్ ను18 కోట్లు, యశస్వి జైస్వాల్ ను18 కోట్లు, రియాన్ పరాగ్ కోసం 14 కోట్లు, ధృవ్ జురెల్ ను 14 కోట్లలకు షిమ్రోన్ హెట్మెయర్ ను11 కోట్లకు, సందీప్ శర్మను 4 కోట్లకు నిలుపుకుంది.