Ayodhya Goods Train : అయోధ్య లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జంక్షన్ (Ayodhya Junction) సమీపంలో నిన్న సాయంత్రం గూడ్స్ రైలుకు చెందిన పలు బోగీలు పట్టాలు (Goods Train) తప్పాయి. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది మరియు ప్రస్తుతానికి, ఎటువంటి ప్రాణనష్టం నివేదించబడలేదు.

భారత దేశంలో (Indian Railways) ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న రవాణా మార్గాల్లో రైళ్ల ప్రయాణం ప్రథమ స్థానంలో ఉంటుంది. దేశంలో రైల్వేలు చాలా సమర్ధవంతంగా… సజావుగా నడుస్తున్నప్పటికీ, కొన్నిసార్లు మానవ తబ్బితమో.. ప్రకృతి విపత్తు వల్లనో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు అతి వేగంతో గానో పట్టాలు తప్పడం జరుగుతుంటాయి. దేశంలో అలా జరిగిన సంఘటనలు వందల సంఖ్యలో ఉన్నాయి. తాజాగా నిన్న ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య జంక్షన్ సమీపంలో రైలు ప్రమాదం జరిగింది.

ఇక విషయంలోకి వెలితే.. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya) జంక్షన్ సమీపంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలుకు చెందిన పలు బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇంతకుముందు ఇదే విధమైన సంఘటనలో, మార్చి 18 న, అజ్మీర్ స్టేషన్ సమీపంలో సబర్మతి-ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి.

SSM