Google Play Store: 43 డేంజర్ యాప్స్ ను గుర్తించిన గూగుల్ ప్లే స్టోర్.. డిలీట్ చేయాలని యూజర్లకు హెచ్చరిక

ప్రస్తుత స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరి చేతితో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఈఫోన్ పనిచేయాలంటే యాప్స్ తప్పనిసరి. అందులో కొన్ని సెక్యూరిటీ లేనివి ఉంటాయి. వీనిని తాజాగా గూగుల్ ప్లే స్టోర్ గుర్తించి ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

  • Written By:
  • Publish Date - August 22, 2023 / 09:27 AM IST

గూగుల్ ప్లే స్టోర్ అనేది స్మార్ట్ ఫోన్ కి కావల్సిన యాప్స్ ని అందించే ఒక ప్రత్యేకమైన యాప్. ఇందులో దాదాపు 30లక్షలకు పైగా గేమ్స్, యాప్స్ ఉంటాయి. ప్రస్తుత కాలంలో గూగుల్ ప్లే స్టోర్ అనేది నిత్యవసర వస్తువులా మారిపోయింది. మనకు ఏ రకమైన వస్తువు కావాలన్నా సూపర్ మార్కెట్లో లభించినట్లు.. ఇక్కడ ప్లే స్టోర్ యాప్ లో మనకు కావల్సిన అన్నిక రకాలా యాప్ లు అందుబాటులో ఉంటాయి. ఇలా తన విస్త్రృతిని రోజురోజుకూ పెంచుకుంటూ వచ్చింది.

నియమాలను ఉల్లంగించిన యాప్స్ పై నిషేధం

ఇదిలా ఉంటే ఈ గూగుల్ ప్లే స్టోర్ సంస్థ ఇందులోని హానికరమైన యాప్స్, గేమ్స్ ను తొలగించనున్నట్లు తెలిపింది. తము నిర్ణయించిన పాలసీలను అతిక్రమిస్తూ, నియమాలను ఉల్లంగించిన యాప్స్ పై నిషేధించనున్నట్లు నిర్ణయం తీసుకుంది. గూగుల్ యూజర్లు కూడా తమ స్మార్ట్ ఫోన్ ను ఒకసారి పరీక్షించి ఈ యాప్స్ ను తొలగించాలని సూచించింది. స్మార్ట్ ఫోన్లను టర్న ఆఫ్ చేయగానే ఈ గుర్తించిన యాప్స్ ఎక్కువగా అడ్వర్టైజ్ లను లోడ్ చేస్తున్నట్లు గురించామని తెలిపింది. ఇలా చేయడం గూగుల్ ప్లే స్టోర్ పాలసీకి విరుద్దం. అందుకే వీటిని హోల్డ్ లో ఉంచినట్లు ప్రకటించింది.

పర్సనల్ డేటా చోరీ అయ్యే అకాశం

ఇలా రద్దు చేసిన యాప్స్ లో టీవీ, డీఎంబీ ప్లేయర్స్, మ్యూజిక్ డెవలపర్స్, న్యూస్ కి సంబంధించిన యాప్స్ ఉన్నట్లు గుర్తించింది. ఈ యాప్ లను అన్ ఇన్స్టాల్ చేయకుంటే మీ వ్యక్తిగతమైన డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని మైకేఫ్ అనే మొబైల్ రీసర్చ్ బృందం తెలిపింది. అందుకే వీటిని గుర్తించి వెంటనే అన్ ఇన్స్టాల్ చేసి డిలిట్ చేయాలని హెచ్చరించింది. ఒకవేళ ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తే ట్రస్టడ్ డెవలపర్స్ నుంచి తీసుకోవాలని సూచించింది. అలాగే పర్మిషన్లు అన్నింటినీ ఒకటికి రెండుసార్లు గమనించి యాక్టివ్ చేసుకోవాలని తెలిపింది. ఇప్పటి వరకూ ఇలాంటి యాప్స్ 25 లక్షల రెట్లు డౌన్లోడ్ అయినట్లు తాజాగా సర్వేలో తేలింది. మరి కొన్నింటిని గుర్తించి అనవసరమైన వాటిని తొలగించి ప్లే స్టోర్ ని అప్డేట్ చేస్తున్నట్లు పేర్కొంది.

T.V.SRIKAR