GOOGLE vs CHAT GPT: గూగుల్ కు గుబులు పుట్టిస్తున్న చాట్ జిపిటి సాప్ట్ వేర్..!

  • Written By:
  • Updated On - February 6, 2023 / 07:30 AM IST

ఆధునిక యుగంలో మరో మజిలి ఆవిష్కృతం అయ్యింది. నేడు టెక్నాలజీలో ఎటు చూసినా అందరి నోట వినిపించే మాట చాట్ జిపిటి. అసలు చాట్ జిపిటి అంటే ఏంటి..? ఎలా వాడాలి..? దేనికి ఉపయోగిస్తారు..? ప్రయోజనాలేంటి..? దుష్పయోజనాలేంటి..? దీని భవిష్యత్ ఎలా ఉండబోతుంది..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చాట్ జిపిటి గురించి తెలుసుకునే ముందు మనం చాట్ బాట్ గురించి తెలుసుకోవాలి. చాట్ బాట్ అంటే జొమాటో, రెడ్ బస్, ఫోన్ పే వంటి పలురకాలా యాప్స్ లో ఉపయోగిస్తూ ఉంటాం. మనం ఫ్రెండ్స్ తో వాట్సప్ లో చాట్ చేసిన విధంగా ఉంటుంది. సంబంధిత కంపెనీ కస్టమర్ కేర్ తో చాట్ చేస్తూ ఉంటాం. అప్పుడు మనకు వెంటనే సెకండ్ల వ్యవధిలో రీప్లే వస్తుంది. ఇక్కడ మనుషులు రిప్లే ఇవ్వరు. కంప్యూటర్లు మనకు కావల్సిన సమాచారాన్ని రిప్లే రూపంలో ఇస్తుంది. మనకు కావల్సిన కన్వర్జేషన్ లను కంప్యూటర్లు ఇచ్చేలా ప్రోగ్రాం చేయబడి ఉంటుంది. మనిషి, కంప్యూటర్ చాట్ ద్వారా మాట్లాడుకుంటే దానిని చాట్ బాట్ అంటాం. ఇప్పుడు చాట్ జిపిటి అంటే ఏంటో చూద్దాం. చాట్ అంటే మాట్లాడుకోవడం అని తెలుసుకున్నాం. జిపిటి అంటే జనరేటివ్ ప్రీట్రైన్డ్ ట్రాన్స్ ఫామర్. ప్రీ ట్రైన్డ్ అంటే మనం చాట్ చేసే ప్రశ్నలకు సమాధానాన్ని ముందుగా అందులో లోడ్ చేసి ఉంచబడుతుంది. అంతేకాకుండా మిషన్ లర్నింగ్, డీప్ లర్నింగ్ ఉంటుంది. అలాగే మనకు ఇంటర్ నెట్ లో ఏమి సర్చ్ చేస్తే అది వచ్చేలా ఉండదు. దీనిని 2022లో తీసుకొచ్చారు. కాబట్టి కేవలం 2021 వరకూ జరిగిన డేటాను మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం వరకూ సంబంధిత డేటాను మాత్రమే అందులో స్టోర్ చేసి ఉంటుంది కనుక. దీనిని అమెరికాకి చెందిన ఓపెన్ ఆర్టిఫీషియల్ అండ్ ఇంటలిజెన్స్ అనే స్టార్టప్స్ సంస్థ వాళ్లు ప్రారంభించారు.

ఇప్పుడు చాట్ జిపిటికి…. గూగుల్ సర్చ్ కి మధ్య ఉన్న తేడాలను తెలుసుకుందాం. గూగుల్ సర్చ్ లో ఏదో ఒక అంశాన్ని సర్చ్ చేశామంటే దానికి సంబంధించిన చాలా లింకులను చూపిస్తుంది. అదే చాట్ జిపిటి అలా చేయదు. తనలో ఉండే మొత్తం డేటాను వెతికి మనకు కావల్సిన సమాచారాన్ని సంక్షిప్తంగా రెండు మూడు లైన్లలో అందిస్తుంది. మనిషి రాస్తే ఎలా ఉంటుందో అలా ఇస్తుంది. అందుకే అందరినీ చాలా చక్కగా ఆకట్టుకుంది. వన్ మిలియన్ యూజర్లను ఆకర్షించుకోవడానికి నెట్ ఫ్లిక్స్ కి 3.5 సంవత్సరాలు, ట్వట్టర్ కి 2 సంవత్సరాల సమయం పట్టింది. ఫేస్ బుక్ కి 10నెలలు, స్పాటిఫైకి 5 నెలలు పట్టింది. అదే ఈ చాట్ జిపిటికి లాంచ్ అయిన 5 రోజుల్లోనే వన్ మిలియన్ యూజర్లను ఆకర్షించింది. దీని దెబ్బకి గూగుల్ కూడా బయపడింది. రానున్న రోజుల్లో గూగుల్ సర్చ్ ఇంజన్ ను రీప్లేస్ చేయవచ్చు అని అంటున్నారు ఐటి నిపుణులు.

అసలు ఈ చాట్ జిపిటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. డైరెక్ట్ గా గూగుల్ లో వెళ్లి చాట్ జిపిటి అని టైప్ చేస్తే వస్తుంది. లేకుంటే చాట్. ఒపెనియా.కాం అని సర్చ్ చేసినా వస్తుంది. అలా చేసిన వెంటనే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఈమెయిల్, మోబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటిపి వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే యూజర్ లాగా రిజిష్టర్ అయిపోతారు. గూగుల్ లాగానే సర్చ్ బార్ కనిపిస్తుంది. అందులో వెళ్లి మనకు కావల్సిన విషయాలు తెలుసుకోవచ్చు.

ఇక దీని ప్రయోజనాలు, దుష్ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మనకు కావల్సిన డేటా చక్కగా బుక్ లో లాగా వచ్చేస్తుంది. దానిని మనం చదువుకోవచ్చు. సెలెక్ట్ చేసి ప్రింట్ కూడా తీసుకోవచ్చు. గూగుల్ లాగా లింకులను ఇవ్వదు. అడిగిన విషయాన్ని చాలా సింపుగా అందిస్తుంది. ప్రోగ్రాం గురించి అడిగితే మొత్తం ప్రోగ్రాం రాసి చూపిస్తుంది. ఇక దుష్ప్రయోజనాల విషయానికి వస్తే.. దీని వల్ల పిల్లలకు రీసర్చ్ నాలెడ్జ్ పై ప్రాక్టికల్ అవగాహను కోల్పోతున్నారంటున్నారు పేరెంట్స్. అలాగే అడిగిన విషయాన్ని సులభంగా తెలుసుకొని వాటినే ప్రింట్ తీసుకొని పరీక్షల్లో కాపీయింగ్ కి పాల్పడుతున్నారని అంటున్నారు. క్లాస్ రూంలో పాఠాలు సరిగ్గా వినేందుకు ఆసక్తి చూపడం లేదంటున్నారు టీచర్లు. దీనివల్ల భవిష్యత్తులో చాలా ప్రమాదం అంటున్నారు. ఒకప్పుడు ఇందులో చట్టవిరుద్దమైన కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను కూడా తెలుసుకునేందుకు వీలుగా ఉండేదట.

ఇక భవిష్యత్తులో దీనిని ఏవిధంగా అభివృద్ది చేస్తారో తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న 3.5 వర్షన్ ను డెవలప్ చేసి ఎథిక్స్, వ్యాల్యూస్, మోరల్స్ ని ప్రోగ్రాం చేస్తున్నారంటున్నారు నిపుణులు. ప్రస్తుతం దీనిని ఇంటర్నెట్ తో లింక్ చేయలేదు. భవిష్యత్ లో 4.5 వర్షన్ తీసుకొచ్చి ఇంటర్నెట్ కు లింక్ చేస్తామంటున్నారు ప్రోగ్రాం డెవలపర్స్. అలాగే ఏదైనా వస్తువు పేరు చెబితే వాటి బొమ్మలను సైతం చూపించేలా ఎక్స్ ట్రా ఫీచర్లను ఇందులో పోందుపరుస్తారట. ఇలా చేస్తే మాత్రం దీనికి తిరుగుండదు అనే చెప్పాలి. ఇక దీనిని ఆపడం సాధ్యం కాదని పలు పేరొందిన కంపెనీలు బయపడుతున్నాయి.