Google Accounts: గూగుల్ అకౌంట్ యూజర్లకు అలర్ట్! రెండేళ్లుగా వాడకుండా ఉన్న గూగుల్ అకౌంట్స్‌ను డిలీట్ చేయబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. గూగుల్ అకౌంట్‌కు సంబంధించిన యూట్యూబ్, జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్ వంటి అన్ని అకౌంట్స్‌ను డిలీట్ చేయబోతున్నట్లు వెల్లడించింది. గూగుల్ ఫొటోలు, వీడియోలు కూడా డిలీట్ అవుతాయి. యాక్టివ్‌గా లేని అకౌంట్ల విషయంలో తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది గూగుల్. రెండేళ్లుగా సైన్ ఇన్ అవ్వని అకౌంట్లను ఇలా డిలీట్ చేసే అవకాశం ఉంది.
అయితే, ఇప్పటికిప్పుడే వీటిని డిలీట్ చేయడం లేదు. వచ్చే డిసెంబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. ఆలోపు యూజర్లు తమ అకౌట్స్ యాక్టివ్ అయ్యేలా చేసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల గూగుల్ అకౌంట్లకు భద్రత లభిస్తుందని, అకౌంట్లు దుర్వినియోగం కాకుండా ఉంటాయని కంపెనీ చెప్పింది. రెండేళ్ల నుంచి వాడుకలో లేని అకౌంట్లను డిలీట్ చేస్తామని గూగుల్ 2020లోనే ప్రకటించింది. వాడుకలో లేని చాలా అకౌంట్లు తమ టు స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోలేవు. అందువల్ల ఈ తరహా అకౌంట్స్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ అకౌంట్స్ అవాంఛిత కంటెంట్ కలిగి ఉండటమో, స్పామ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి అకౌంట్లను తొలగిస్తే ఇతర అకౌంట్లకు ప్రమాదకరంగా మారకుండా ఉంటాయి. భద్రత పెరుగుతుంది. యూజర్లు తమ అకౌంట్లు డిలీట్ కాకుండా ఉండాలంటే వెంటనే వాటిని వాడుకలోకి తేవాలి.
అంటే లాగిన్ అయి, మెసేజ్ ఓపెన్, సెండ్ చేయాలి. గూగుల్ డ్రైవ్ వాడాలి. యూట్యూబ్ అకౌంట్‌తో లింక్ చేసి, వీడియో చూడాలి. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేయాలి. గూగుల్ సెర్చ్ వాడాలి. థర్డ్ పార్టీ యాప్స్‌ను గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. వీటిలో ఏది చేసినా మీ అకౌంట్ సేఫ్‌గా ఉంటుంది. లేదంటే డిలీట్ అవుతుంది. అయితే, ప్రస్తుతం గూగుల్ డిలీట్ చేయాలి అనుకుంటున్నవి పర్సనల్ అకౌంట్స్ మాత్రమే. ప్రైవేట్, బిజినెస్ అకౌంట్స్, ఆర్గనైజేషన్స్‌కు చెందిన అకౌంట్స్‌ను డిలీట్ చేయడం లేదు. దీని గురించి వినియోగదారులకు కంగారు అక్కర్లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన సమాచారం యూజర్లకు మెయిల్స్, మెసేజెస్ రూపంలో పంపుతుంది. అలాగే దీనితో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్లకు కూడా సమాచారం వెళ్తుంది. ఒకవేళ మీకు మీ అకౌంట్ డిలీట్ గురించి సమాచారం వస్తే వెంటనే అకౌంట్ యాక్టివ్‌గా ఉంచుకుంటే సరిపోతుంది.