మళ్ళీ భయపెడుతున్న బుడమేరు

విజయవాడతో పాటుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో విజయవాడ నగరంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. బుడమేరు పరీవాహక ప్రాంతం ప్రజలకు హైఅలర్ట్ జారీ చేసింది అధికార యంత్రాంగం.

  • Written By:
  • Publish Date - September 9, 2024 / 09:50 AM IST

విజయవాడతో పాటుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో విజయవాడ నగరంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. బుడమేరు పరీవాహక ప్రాంతం ప్రజలకు హైఅలర్ట్ జారీ చేసింది అధికార యంత్రాంగం. భారీ వర్షాలు కారణంగా బుడమేరుకు భారీగా వరద ప్రవాహం పెరుగుతుంది. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద 2.7 అడుగుల మేర నీటిమట్టం ఉంది.

వరద దిగువకు విడుదల కావడం వలన లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బుడమేరు పక్కన ఎలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్, గుణదల, ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడు తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలలోకి వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. బుడమేరు పరివాహ ప్రాంతంలోని ప్రజలు పునరావస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.