ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల MLC ఉప ఎన్నిక నేడు జరగనుంది. ఇవాళ ఉదయం 8 గంటల మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. కాగా పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన అభ్యర్థులుగా.. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, BRS నుంచి రాకేశ్ రెడ్డి, BJP అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీని కోసం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4.63 లక్షలమంది గ్రాడ్యు యేట్లు ఓటు వేయనున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. ఈ ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రిటర్నింగ్ అధికారి(ఆర్వో)గా వ్యవహరిస్తున్నారు. జూన్ 7న కౌంటింగ్ జరిపి, విజేతను వెల్లడించనున్నారు. ఈ సారి గెలుపొందే అభ్యర్థి 2027 మార్చి వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు.