మోదీ ఏం చేసినా చాలా ఆడంబరంగా చేస్తారు. ఆయనకు పబ్లిసిటీపై పిచ్చి పీక్స్‌లో ఉంటుంది. మొతేరా స్టేడియాన్ని మోదీ స్టేడియంగా పేరు మార్చిన మన ప్రధాని.. స్పోర్ట్స్ కాంప్లేక్స్ ప్రారంభోత్సవ సమయంలో ఆయన చెప్పిన మాటలకు..జరుగుతున్న సీన్లకు ఏ మాత్రం పొంతన లేదని అర్థమవుతోంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్‌డేన కురిసిన చిన్నపాటి వర్షానికే మ్యాచ్ రెండు గంటలకు పైగా ఆగిపోయింది. చెప్పాలంటే ఫలితం తారుమారు కూడా అయ్యింది. 20ఓవర్లు ఆడి 215పరుగులు టార్గెట్‌ను రీచ్ అవ్వడం వేరు.. 15ఓవర్లే ఆడి 171రన్స్ ఛేజ్ చేయడం వేరు. ఎందుకంటే వికెట్లు పడిపోయే ఓవర్లు చివరి నాలుగు ఓవర్లు.. 180పరుగుల వరకు వచ్చి ఆఖర్లో బోల్తా పడే టీమ్‌లే ఎక్కువగా ఉంటాయి.. 200కు పైగా రన్స్ ఛేజింగ్‌లో చెన్నై రికార్డులు చెత్తగా ఉన్నాయి.. కానీ ధోనీ సేన కప్ కొట్టేలా మోదీ స్టేడియం డ్రైనేజీ సిస్టమ్ సాయం చేసింది.
ఐదు నిమిషాల వర్షానికి రెండుగంటలు వేస్ట్:
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో వర్షం కురిస్తే.. రెయిన్ ఆగిపోయిన 15నిమిషాల్లో పిచ్ డ్రై చేసే టెక్నాలజీ అందుబాటులో ఉంది. సమ్మర్‌లో కూడా బెంగళూరులో వర్షాలు కురుస్తుంటాయి.. మ్యాచ్ రద్దయితే ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే ఖర్చుకు రాజీపడకుండా బెంగళూరు ప్రపంచంలో టాప్ డ్రైనేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుంది. మరోవైపు ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు తెచ్చుకున్న మోదీ స్టేడియంలో మాత్రం చిన్నపాటి వర్షం కురిస్తే మ్యాచ్ మొదలుపెట్టడానికి రెండు గంటలకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. వాన ఆగిపోయి గంటలు గడుస్తున్నా ప్రాక్టీస్ పిచ్‌పై నిలిచిపోయిన నీరు బయటకు వెళ్లే దారి లేకుండా పోయింది.
పిచ్‌ను డ్రై చేయడానికి గ్రౌండ్ సిబ్బందికి తలకు మించిన భారంలా మారింది. స్పాంజీలు తెచ్చి పిచ్‌ను డ్రై చేసే పనిలో మునిగిపోయారు సిబ్బంది. పాపం చాలా కష్టపడ్డారు కూడా. ప్రపంచంలోని అన్నీ క్రికెట్ బోర్డుల కంటే వందల రెట్లు ఆదాయం సంపాదించే బోర్డుగా పేరొందిన బీసీసీఐ కంటే.. మిగిలిన దేశాల్లోనే అడ్వెన్సడ్‌గా పిచ్ డ్రై చేసే పరికరాలున్నాయి. మన దగ్గర ఉన్న పరికరాలు చూస్తే మాత్రం విమర్శించకుండా ఉండలేని పరిస్థితి! స్పాంజీలు, బకెట్లతో గంటల పాటు పిచ్‌ను ఆరబెట్టారు గ్రైండ్స్ స్టాఫ్. దీంతో గుజరాత్ మోడల్ గ్రౌండ్ అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇలానేనా ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియాన్ని మెయింటైన్ చేసేది..? అందులో ఈ ఏడాది ఇండియాలోనే వన్డే ప్రపంచ కప్ ఉంది. ఫైనల్ మోదీ స్టేడియంలోనే పెడతారన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకుంటే లక్షా 32వేలు సిట్టింగ్ సామర్థ్యమున్న స్టేడియం అది. అందుకే వరల్డ్ కప్ సమయానికైనా ఇలాంటి తప్పులు సరిదిద్దుకుంటే మంచిది.. లేకపోతే ఇప్పుడు పోయిన పరువు గంగపాలే అయ్యింది.. అప్పుడు పసిఫిక్ పాలు అవుతుంది. అంటే ప్రపంచం మొత్తం ముందు తలదించుకోవాల్సి వస్తుందన్నమాట!