తెలంగాణలో ఆరు గ్యారంటీలు… దేశవ్యాప్తంగా రాహుల్ న్యాయ్ గ్యారంటీలు… ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాంగ్రెస్ కే ఓటెయాలని కోరుతున్నారు మల్కాజ్ గిరి (Malkaj Giri) కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి(Patnam Sunita Mahender Reddy). రాష్ట్రంలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ అధికారం చేపట్టిన రెండు రోజులకే రెండు గ్యారంటీలను అమలు చేయడం… 100 రోజుల పాలనలో ప్రజల వాగ్దానాలను ఒక్కోటి నేరవేర్చారన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి (India Alliance) అధికారంలోకి వస్తే… యువతకు 5 గ్యారంటీలు అమలు అవుతాయని చెప్పారు.
మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి ప్రచారం జోరుగా సాగింది. కాంగ్రెస్ న్యాయ్ గ్యారంటీలు కావాలంటే తనను గెలిపించాలని కోరారు. గ్రాడ్యుయేట్స్ కి లక్ష నిరుద్యోగ భృతి, 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, పేద మహిళలకు ఏడాది లక్ష రూపాయలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50శాతం మహిళలకు రిజర్వేషన్లు, పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లాంటి గ్యారంటీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఇవే కాకుండా… దేశవ్యాప్తంగా కులగణన చేపడతామనీ… రిజర్వేషన్లలో 50శాతం పరిమితిని ఎత్తేస్తామని, విద్యారుణాలను మాఫీ చేయడం, కూలీలకు కనీస వేతనం 400 రూపాయలు ఉండేలా చూస్తామంటున్నారు సునీత మహేందర్ రెడ్డి.
రాష్ట్ర, దేశ స్థాయిలో కాంగ్రెస్ ఇస్తున్న హామీలు, గ్యారంటీలే కాకుండా… మల్కాజ్ గిరి లోక్ సభనియోజకవర్గంలో సమస్య పరిష్కారానికి ప్రత్యేక మేనిఫెస్టోని కూడా పట్నం సునీత రిలీజ్ చేశారు. విద్యా, వైద్య సౌకర్యాలను కల్పించడం… విద్యార్థులకు JEE, NEET లో ఉచిత శిక్ష, ప్రతి డివిజన్ లో స్మార్ట్ స్కూల్స్ ఏర్పాటు, బస్తీల్లో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపైనా హామీ ఇచ్చారు. హైదరాబాద్ సిటీలో మురికికాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో… వాటిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు పట్నం సునీత. కాలుష్య నిర్మూలనకు గ్రీన్ ఇండస్ట్రీలను ఏర్పాటు చేసి… మల్కాజ్ గిరి జనం ఎలాంటి కాలుష్యంలేని ప్రశాంత వాతావరణంలో జీవించేలా చేస్తామని హామీ ఇచ్చారు.
భూకబ్జాలు, బెదిరింపులు, 17 వందల కోట్ల రూపాయల FCI స్కామ్, కులం పేరుతో రాజకీయం చేసే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించాలని కోరారు. నిత్యం మల్కాజ్ గిరి అభివృద్ధిని ఆకాంక్షించే తనకు ఓటు వేస్తే… నిత్యం జనానికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి. ఈటల లాగా స్కాములు కాడు… స్కీములతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని అంటున్నారు సునీత.