Guru Poornami : దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు.. గురుపౌర్ణమి విశిష్టత ఏంటో తెలుసా..?

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురుపౌర్ణమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. దేశ వ్యాప్తంగా సాయిబాబా దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక దక్షిణాదిలోనిని ప్రముఖ శిరిడీ ఆలయంకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురుపౌర్ణమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. దేశ వ్యాప్తంగా సాయిబాబా దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక దక్షిణాదిలోనిని ప్రముఖ శిరిడీ ఆలయంకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. దీంతో శిరిడీ ఆలయం భక్తుల తాకిడితో కోలాహలం నెలకొంది. పూజలు, భజనలు, కీర్తనలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆదివారం కావడంతో కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శించి సాయిబాబాకు పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరో వైపు మహారాష్ట్రలోని కొలువైన షిరిడీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వరంగల్‌.. ఇలా వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో వైభవోపేతంగా గురుపౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఏపీలోని విజయవాడ, విశాఖ, తిరుపతి, ఒంగోలు, కర్నూలు బాలాజీనగర్‌, నెల్లూరు, విజయనగరం, అనంతపురంలోని ఆలయాలకు భక్తులు భారీగా చేరుకొని సాయినాథుడిని దర్శించుకుంటున్నారు.

  • గురుపౌర్ణమి విశిష్టత ఏంటంటే…?

హిందువులు జరుపుకునే పండుగలలో గురు పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది. మన భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది. ఆషాడ మాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు. గురు సామానులైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుటయే ఈ గురు పౌర్ణమి ముఖ్య ఉద్దేశం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తి స్వరూపమే గురువు అని అర్థం.. గురువుల్లో మొదటగా వ్యాస భగవానుడు ఉద్భవించాడు అందుకే వ్యాస పూర్ణిమ, గురుపూర్ణిమ అని అంటుంటారు. దీంతో వేద వ్యాసుడికి ప్రతీకగా ప్రారంభమైన ఈ పండగ క్రమంగా ఓ ఆనవాయితీగా మారింది. అయితే మొదటగా ఆదిశంకరాచార్యులు గురుపరంపరలో వస్తే ఆరాధించిన వారు చాలామంది ఉన్నారు. మరోవైపు బౌద్ధం, జైన మతాలకు చెందిన వారు కూడా వారి గురువులను స్మరిస్తూ ఈ గురు పౌర్ణిమ జరుపుకోవడం విశేషం.

  • గురు పౌర్ణమి నాడు సాయిబాబాకు పూజలు ఎందుకు చేస్తారో తెలుసా..?

శ్రీ సమర్థ సద్గురు సాయినాథుడు ఉన్నారని హిందువులు నమ్ముతారు.. అందుకే గురు పౌర్ణమి రోజున సాయిబాబాను పూజిస్తారు. ఆ సాయినాథుడు సద్గురువుగా ప్రత్యక్షంగా కనబడి ఏమీ ఆశించకుండా అందరిని సన్మార్గంలో నడిపారని హిందువుల నమ్మికా.. ఆ దేవుడి స్థానంలో గురువుగా వచ్చి భక్తులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేసిన వారు సాయినాథులవారు. ఆ కలియుగంలో బాబా గురువుగా ఉండడం చేత గురు పౌర్ణమి నాడు ఆయనను పూజించి ఆయన మార్గంలో నడిస్తే మంచి విజయం కలుగుతుందని ఆ భక్తుల విశ్వాసం..

  • గురు పౌర్ణమి నాడు సాయిబాబాకు ప్రత్యేక పూజలు…

గురు పౌర్ణమి నాడు సాయిబాబా ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారని అర్చకులు చెప్పుకొచ్చారు. ముందుగా ప్రభాత సేవ ఖాగడ హారతి, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేస్తుంటారు. ఇలా అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహిస్తారు. ఆ బాబాకు అన్నదానం అత్యంత ప్రీతికరమైనది. నాడు ఆయనే తన చేతులతో స్వయంగా వండి వడ్డించేవారని ఆ చరిత్ర చెబుతుంది. అందుకే బాబా ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.

Suresh SSM