Gutta Amit : కాంగ్రెస్ లోకి గుత్తా అమిత్… సుఖేందర్ రెడ్డి చేరేదెప్పుడు ?

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరాడు అమిత్.

BRS పార్టీలో సీనియర్లు ఒక్కొక్కరు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మునుగోడు టిక్కెట్ ఆశించాడు అమిత్. సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్లకే టిక్కెట్ ఇచ్చారు గులాబీ బాస్. అమిత్ తన తాత వెంకట్ రెడ్డి పేరుతో మెమోరియల్ ట్రస్ట్ పెట్టి… మునుగోడులో గత కొంత కాలంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ గెలిచి ఎమ్మెల్యే అవ్వాలని కలలుగన్నారు గుత్తా అమిత్. కానీ బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అమిత్ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు.

నల్లగొండ ఎంపీ టిక్కెట్ అమిత్ కే ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయనకు సహకరించేందుకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వర్గం ఒప్పుకోలేదు. పార్టీలో సహాయ నిరాకరణ ఉంటుందని గ్రహించిన అమిత్… లోక్ సభ పోటీకి దూరంగా ఉన్నారు. ఈమధ్యే గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. అహంకారమే కేసీఆర్ ను ముంచిందన్నారు. కొందరు కోటరీ నేతలు చెప్పినట్టు ఆయన నడుచుకుంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచీ కేసీఆర్ ని కలవడానికి ట్రై చేస్తున్నా… అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

ఈ ఆరోపణలపై BRS లో చర్చ జరుగుతుండగానే… గుత్తా అమిత్ కాంగ్రెస్ లో చేరడం సంచలనంగా మారింది. మరో రెండు, 3 రోజుల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారతారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ సీనియర్లు కేకే, కడియం శ్రీహరి, దానం నాగేందర్ హస్తం పార్టీలో చేరిపోయారు. గుత్తా చేరికతో నల్లగొండలో కాంగ్రెస్ బలం మరింత పెరిగే ఛాన్సుంది.