Heavy rains IMD : ఇవాళ రాష్ట్రాంల్లో వడగండ్ల వానలు.. ఈ జిల్లాలకు అలర్ట్..

రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు 7 రోజులు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు 7 రోజులు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుశాయి. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, వర్షాలతో పాటు వడగండ్ల వర్షాలు కూరిసే అవకాశం ఉందని హెచ్చరించిది. మరో వైపు ఎండలు కూడా బాగానే మండుతున్నాయి.

ఈ జిల్లాలకు వడగండ్ల వాన..

నేడు జిగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వానలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది.

ఈ జిల్లాలకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు..

ఇక నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్ జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు విస్తాయని, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.

ఈ జిల్లాలకు వర్ష సూచన..

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు మంచిర్యాల, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.