గత కొంత కాలంగా.. ఇజ్రాయెల్ (Israel), హమాస్ గ్రూప్ (Hamas group) మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకరి పై ఒకరు ప్రతి దాడులు చేసుకుంటూ.. వెళ్ల మంది ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. పాలస్తీనా (Palestine) ఉగ్రవాద సంస్థ హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ (Political Bureau Chief) ఇస్మాయిల్ హనియే హత్యకు గురైయ్యారు. ఇరాన్‌లోని నివాసంలో జరిగిన దాడిలోఇస్మాయిల్‌తో పాటు అతడి బాడీగార్డు ఒకరు చనిపోయారని హమాస్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ హత్యకు పాల్పడింది ఎవరనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మంగళవారం ఉదయం టెహ్రాన్‌లోని ఇస్మాయిల్ నివాసంపై జియోనిస్టులు జరిపిన దాడిలో ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యారని హమాస్ నిర్ధారించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఓ ప్రకటనలో తెలిపింది. పాలస్తీనాలో యూదుల హక్కులు, ప్రత్యేక రాజ్యం కోసం పోరాడుతున్న జియోనిస్టులు జరిపిన ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంటుంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని హమాస్ తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కి ఇస్మాయిల్ వెళ్లగా.. అక్కడున్న అతని నివాసంపై జియోనిస్ట్‌లు దాడి చేయడంతో ఆయన మరణించారు.
హనియే పూర్తి పేరు.. ఇస్మాయిల్ అబ్దుల్సలామ్ అహ్మద్ హనియేహ్.. (Ismail Abdul Salam Ahmed Haniyeh) ఇతను ఈజిప్టు ఆక్రమిత గాజా స్ట్రిప్‌లోని అల్-షాతి శరణార్థి శిబిరంలో 1963లో ముస్లిం పాలస్తీనియన్ల కుటుంబంలో జన్మించాడు. ఇజ్రాయెల్ 1997లో అహ్మద్ యాసిన్‌ను జైలు నుండి విడుదల చేసిన తర్వాత, హనియే అతని కార్యాలయానికి అధిపతిగా నియమితుడయ్యాడు. 1980ల చివర్లో హమాస్‌లో చేరారు. హమాస్ ఫౌండర్ యాసిన్‌కు అత్యంత సన్నిహితుడు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2006 జనవరి 25న హమాస్ “లిస్ట్ ఆఫ్ చేంజ్ అండ్ రిఫార్మ్” విజయం తర్వాత అదే సంవత్సరం ఫిబ్రవరి 16న హనీయే ప్రధానమంత్రిగా పాలస్తీనా ప్రధానిగా ఎన్నికయ్యారు. 2006 మార్చి 29న ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 2017లో హమాస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. అమెరికా అతడిని ఉగ్రవాదిగా గుర్తించడంతో ఖతర్‌లో నివాసముండేవారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన ముగ్గురు కుమారులూ చనిపోయారు.
గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో హమాస్ నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే.. ఆ నరమేధంలో ఏకంగా 1,195 మంది అమాయక పౌరులను హత మార్చారు. దీంతో ఇస్మాయిల్ హనియేను అంతమొందించి హమాస్ గ్రూపును సమూలంగా తుడిచి పెడతామంటూ అక్టోబర్ 7 ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఇజ్రాయెల్‌పై దాడులకు ప్రతీకారంగా గాజాలో ప్రతీకార సైనిక చర్యలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు జరిగిన ఈ యుద్దంలో 1,200 మంది ఇజ్రాయెల్‌లు మరణించారు. దాదాపు 250 మందిని బందీలుగా ఉన్నారు. 39,360 మంది పాలస్తీనియన్లు హతమయ్యారు.
కాగా ఇవాళ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధానికి టెహ్రాన్ వెళ్లారు. ఇరాన్ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నే ముందు.. టెహ్రాన్‌లోని తన ప్రధాన కార్యాలయంలో ఉండగా జియోనిస్టులు చేసిన దాడిలో ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ ఏమైనా ప్రతీకారం తీర్చుకుంటుందా అనే అంశం పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. మరోవైపు హమాస్ ప్రతీకార దాడులకు దిగేందుకు అవకాశం ఉండటంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది.