Hari Rama Jogaiah: జనసేన ఓటర్ల సపోర్ట్ లేకుండా టీడీపీ సీట్లు గెలిచే అవకాశం లేదంటున్నారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వరుస లెటర్లు రాస్తున్న ఆయన మరో లెటర్ రిలీజ్ చేశారు. గత కొంతకాలంగా.. టీడీపీ – జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్‌కు సూచనలు చేస్తూ లెటర్లు రాస్తున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలపై హరిరామజోగయ్య స్పందించారు.
Pushpa 2: పుష్ప రచ్చ.. సింహంతో సుకుమార్
ఈ జిల్లాలో ఏయే సీట్లు జనసేనకు కేటాయిస్తే గెలుస్తుందో ఆయన లెటర్లో వివరించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం, భీమవరం, తాడేపల్లి గూడెం, తణుకు, ఏలూరు, ఉంగటూరు, ఉండి, పోలవరం, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు అసెంబ్లీ స్థానాలతో పాటు నరసాపురం పార్లమంట్ స్థానం కూడా జనసేనకు కేటాయించాలని హరి రామ జోగయ్య సూచించారు. ఈ సీట్లను జనసేనకు ఇవ్వకపోతే జరగబోయే నష్టాన్ని టీడీపీయే భరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెండు పార్టీల మధ్య ఓట్ల ట్రాన్స్‌ఫర్ అనేది పక్కాగా జరగాలనీ.. రెండు పార్టీల శ్రేయస్సు కోరి ఈ సూచనలు చేస్తున్నట్టు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ సామాజిక వర్గం కాపులు ఎక్కువగా ఉన్నారు.
వీళ్ళల్లో 90శాతం ఓటర్లు జనసేనను బలపరుస్తారని లెటర్లో తెలిపారు మాజీ మంత్రి హరి రామ జోగయ్య. ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వైసీపీని ఓడించడానికి ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు జనసేనకే ఇవ్వాలన్నారు. జనసేన లేకుండా టీడీపీ ఓట్లు గెలుచుకునే అవకాశం లేదంటున్నారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య.