HARISH RAO: ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సోషల్ మీడియాలోనే ఉంటారని, ఆమెకు పని తక్కువ, ప్రచారం ఎక్కువ అని విమర్శించారు మంత్రి హరీష్ రావు. ఆదివారం ఆయన ములుగు జిల్లాలో బీఆర్ఎస్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి నాగ జ్యోతిని గెలిపించాలని కోరారు. ‘‘తెలంగాణ వచ్చాక ములుగు జిల్లా బాగా అభివృద్ధి జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా ములుగును జిల్లా చేశారు. సమ్మక్క, సారక్క జాతర ను పెద్ద యెత్తున నిర్వహిస్తున్నారు కేసిఆర్.
KCR SKETCH : కేసీఆర్ భలే స్కెచ్ ..! వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు ప్లాన్
ఐటీసీ ఫ్యాక్టరీ ప్రారంభానికి రెఢీ గా ఉంది. ములుగు అభ్యర్థిగా నాగజ్యోతిని గెలిపించండి. ఎవరెన్ని చెప్పినా నమ్మకండి. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. సీతక్క సోషల్ మీడియా లో మాత్రమే ఉంటారు. సీతక్కకు పని తక్కువ ప్రచారం ఎక్కువ. నిరుపేద అమ్మాయి నాగజ్యోతి. ఆమెను గెలిపించాలని కోరుతున్నా. సీతక్క ఓడిపోతున్ననని తెలిసి కోపంతో ఇష్టం వచ్చినట్లు నోరు జారుతోంది. ఆమె ఓటమి ఖాయం. కాంగ్రెస్ నేతల కరెంట్ 5 గంటల కరెంట్ ప్రచారంతో అబాసుపాలైంది. ఉచిత కరెంట్ ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? వ్యవసాయానికి ఎంత hp మోటార్ వాడుతారో కూడా తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి. కర్ణాటక లో రెండు గంటల కరెంట్ కూడా రావటం లేదని అక్కడి మాజీ సీఎం కుమార స్వామి చెప్తున్నాడు.
ఇలాంటి కాంగ్రెస్ మనకు అవసరమా? కేసిఆర్ హయంలో పల్లెల్లో కరువు లేదు. హైదారాబాద్ లో కర్ఫ్యూ లేదు. కర్ణాటకలో రైతు బందు ఇవ్వని కాంగ్రెస్ ఇక్కడ 15 వేలు ఎలా ఇస్తారు? కేసిఆర్ గెలిస్తే 16వేలు రైతు బంధు ఇవ్వటం ఖాయం. ధాన్యం కొనమంటే కేవలం 13 క్వింటాళ్లు కొంటామని చెప్తున్నారు. మరి మిగిలిన ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలి. వంద అబద్ధాలు ఆడి సీఎం కుర్చీ దక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. 11 సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ కనీసం బిందె నీళ్ళు ఇవ్వలేదు కాంగ్రెస్. కేసిఆర్‌ను బూతులు తిడుతున్నారు. మాకు తిట్టడం చేతకాక కాదు. తిడితే రేపటి వరకు తిడుతాం. మాకు సంస్కారం ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ అది చేస్తాం ఇది చేస్తాం చెప్తోంది. బిజెపి ఇన్నేళ్లు అధికారంలో ఉంది ఎందుకు చేయలేదు” అని హరీష్ వ్యాఖ్యానించారు.