ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కేసు అటు తిరిగి.. ఇటు తిరిగి.. హరీష్‌రావు (Harish Rao) మెడకు చుట్టుకుంటోంది. దీంతో బీఆర్ఎస్ (BRS) ట్రబుల్ షూటర్.. బిగ్గెస్ట్ ట్రబుల్‌లో పడిపోయాడు. ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న భుజంగరావు(Bhujan Rao), రాధాకిషన్ రావు (Radhakishan) వాంగ్మూలం.. ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. మీడియా యాజమాన్యాలు, జర్నలిస్టులు, జ్యుడీషియరీతో పాటు రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తల ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు ఆ ఇద్దరు వాంగ్మూలం ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్‌రావు అండదండలతోనే ఇదంతా జరిగిందని చెప్పారు.
ఐన్యూస్ చానెల్ (i News Channel) ఎండీ శ్రవణ్ రావు (MD Shravan Rao) తో.. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక నిందితుడు అని ప్రణీత్ రావుకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని వివరించారు. హరీష్ ఆదేశాలతోనే ప్రణీత్ రావు వెళ్లి.. శ్రవణ్‌ను కలిసినట్లు తెలుస్తోంది. శ్రవణ్‌తో టచ్‌లో ఉండాలని ప్రణీత్ రావుకు.. మాజీ మంత్రి హరీష్ సూచించినట్లు వాంగ్మూలం ఇచ్చారు ఆ ఇద్దరు మాజీ అధికారులు. ఇక హరీష్ రావు సపోర్టుతో శ్రవణ్ రావు చెలరేగిపోయారని తెలుస్తోంది. మీడియా అధినేతలు, జర్నలిస్టుల ఫోన్‌లను.. శ్రవణ్‌రావు దగ్గర ఉండి మరీ ట్యాప్ చేయించాడని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరితో పాటు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై.. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఇద్దరి ఫోన్‌లను ట్యాపింగ్ చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు రాధాకిషన్ రావు.. వీళ్లతో పాటు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫోన్‌లను కూడా ట్యాప్ చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు.
మీడియా సంస్థలపై నిఘా కోసం.. చేయని దారుణాలు లేవు. మీడియా సంస్థల యజమానులు, జర్నలిస్టుల ఫోన్‌లు ట్యాప్ చేసేందుకు.. ఏకంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ఓ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వాంగ్మూలం ఇచ్చారు ఇద్దరు నిందితులు. హరీష్ రావు డైరెక్షన్‌లోనే ఐన్యూస్ చానెల యజమాని శ్రవణ్ కుమార్ పనిచేశారని.. ఇష్టారాజ్యంగా వ్యవహరించారని వివరించారు. ఐతే ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు రాగానే.. ఐన్యూస్ చానెల్ యజమాని శ్రవణ్‌రావు దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం అతనిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భుజంగరావు, రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంతో.. చానెల్ యజమాని శ్రవణ్‌రావు, పోలీసు అధికారి ప్రణీత్ రావు.. మాజీ మంత్రి హరీష్ రావు మధ్య సంబంధాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం మరింత లోతుగా ఆరా తీస్తోంది.