BRS Party: జనగామ బీఆర్ఎస్‌లో మంటలు.. ముత్తిరెడ్డి ఎంత పని చేశారంటే..

ఫస్ట్‌ లిస్ట్.. బీఆర్ఎస్‌లో రేపుతున్న అలజడి అంతా ఇంతా కాదు. నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు కేసీఆర్.

  • Written By:
  • Publish Date - September 2, 2023 / 04:00 PM IST

ఫస్ట్‌ లిస్ట్.. బీఆర్ఎస్‌లో రేపుతున్న అలజడి అంతా ఇంతా కాదు. నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు కేసీఆర్. అందులో జనగామ ఒకటి. మిగతా నియోకవర్గాల సంగతి ఎలా.. జనగామలో టికెట్ జగడం కనిపిస్తోంది. బీఆర్ఎస్‌లోనే పోరు పీక్స్‌కు చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్సెస్‌ పల్లా వర్గాల మధ్య యుద్ధంతో.. రాజకీయం వేడెక్కింది. నిజానికి జాబితా ప్రకటించకపోయినప్పటి నుంచే.. ఇక్కడ రచ్చ కొనసాగుతోంది. నియోజకవర్గానికి చెందిన కీలక నేతలను హైదరాబాద్‌ పిలిపించి పల్లా భేటీ కావడం.. దీనికి కౌంటర్‌గా ముత్తిరెడ్డి బలప్రదర్శన చేయడం.. పాలిటిక్స్‌లో సెగలు రేపింది.

ఐతే ఆ తర్వాత ఇక్కడ టికెట్ హోల్డ్‌లో పెడుతున్నట్లు కేసీఆర్‌ ప్రకటించడంతో.. యుద్ధం మరింత ముదిరినట్లు అయింది. అప్పటి నుంచి ఏదో రకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వార్తల్లో ఉంటున్నారు. ఈ మధ్య ముత్తిరెడ్డి వర్గ నేతలపై పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ దళిత సంఘాల నేతలు.. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో నిరసన తెలిపారు. దీన్ని ముత్తిరెడ్డి ఆయుధంగా మార్చుకున్నారు. దళితులపై దాడి చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి జ్ఞానోదయం కలగాలని… చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు ముత్తిరెడ్డి. చొక్కా విప్పి అర్థనగ్నంగా నిరసన తెలిపారు.

ఉద్యమంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియదని.. దళిత నాయకుల మీద కేసులు పెట్టడం సరైంది కాదు అంటూ ముత్తిరెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్‌ పార్టీని విచ్ఛిన్నం చేసే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. పల్లా రాజేశ్వర్ దురాగతాలను కేసీఆర్ క్షమించరన్న ముత్తిరెడ్డి.. పార్టీ తరఫున దళితులకు క్షమాపణ చెప్తున్నానంటూ వ్యాఖ్యలు చేశారు.