రాజకీయం ఎలా ఉంటుందో అంచనా వేయడం ఎంత కష్టమో.. జనాల మూడ్‌ను, వాళ్ల తీర్పును అంచనా వేయడం కూడా అంతకుమించిన కష్టం. ఇదే ఇప్పుడు రీసౌండ్‌లో వినిపిస్తోంది తెలంగాణలో. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయ్. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయా అనే ఆసక్తి కనిపిస్తోంది. కాంగ్రెస్ జోష్ కంటిన్యూ అవుతుందా.. బీజేపీ రికార్డ్ క్రియేట్ చేస్తుందా.. బీఆర్ఎస్ అద్భుతం అనిపిస్తుందా అంటూ రకరకాల చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. ఐనాసరే కేసీఆర్‌లో, కేటీఆర్‌లో ఏ మాత్రం ధీమా తగ్గినట్లు కనిపించడం లేదు. ఎంపీ ఎన్నికల్లో తమదే పైచేయి అని కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. ఐతే గ్రౌండ్ లెవల్‌లో సీన్ వేరేలా ఉంది అని పోలింగ్ ముందు వరకు చర్చ జరిగింది. ఐతే ఇప్పుడు వాళ్ల కేసీఆర్ కాన్ఫిడెన్సే నిజం కాబోతోందా.. ఎంపీ ఫలితాల్లో సంచలన ఫలితాలు చూడబోతున్నామా అంటే.. అవును అనే సమాధానం వినిపిస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 17స్థానాల్లో పోటీ చేసింది. ఐతే కాంగ్రెస్‌కే అత్యధిక స్థానాలు వస్తాయని.. బీజేపీ రెండో స్థానంలో ఉంటుందని.. బీఆర్ఎస్ మూడో ప్లేస్‌కు పరిమితం అవుతుందని రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. బీఆర్ఎస్‌కు ఒకటి రెండు సీట్లకు మించి గెలవడం కూడా కష్టం అంటూ తేల్చేశారు మరికొందరు. ఐతే కౌంటింగ్‌కు టైమ్ దగ్గరపడుతున్న వేళ.. సరకొత్త చర్చ తెరమీదకు వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వీక్ అయిన కారు పార్టీ.. ఎంపీ ఎన్నికల లోపు తిరిగి పుంజుకుందని.. అదే ఫలితాల్లో కనిపించడం ఖాయం అంటూ కొత్త అభిప్రాయం తీసుకువస్తున్నారు. గ
త పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 9 స్థానాలు రాగా.. ఈసారి అన్ని సీట్లు రాకపోయినా.. ఆరు స్థానాల వరకు గెలిచే చాన్స్ ఉందని అంటున్నారు. ఇదెలా సాధ్యం అంటే.. కారణాలు కూడా చూపిస్తున్నారు. వాకింగ్ స్టిక్‌తోనే కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌పై సానుభూతితో పాటు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడం, విద్యుత్ సరఫరా సరిగా లేదంటూ ప్రచారం జరగడం.. ధాన్యం కొనుగోలు వ్యవహారం.. జనాల్లోకి వెళ్లాయని.. ఇవన్నీ కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారే చాన్స్ ఉందని అంటున్నారు. ఇవి బీఆర్ఎస్ మీద సానుకూలత పెంచాయని చెప్తున్నారు. ఐతే బీజేపీ గతంలో నాలుగు స్థానాల్లో విజయం సాధించగా.. ఈసారి అంతకుమించి గెలుస్తుందని అంటున్నారు. మరి ఈ అంచనా నిజం అవుతుందా లేదా అన్నది ఫలితాలు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే..