జనసేన టీడీపీ (TDP) కార్యకర్తలు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి.. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి నుంచి పోటీ చేయబోయే ఉమ్మడి అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేశారు. ఈ రెండు పార్టీల పొత్తులో భాగంగా.. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు దక్కాయి. ఈ 24 సీట్లలో కేవలం ఐదుగురు అభ్యర్థులను మాత్రమే పవన్ ప్రకటించాడు. తాను , తన అన్న నాగబాబు (Naga Babu) ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనే విషయాన్ని ఇంకా ఎనౌన్స్ చేయలేదు. చంద్రబాబు మాత్రం 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. తాను కప్పం నుంచే పోటీ చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే.. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు రాజకీయంగా ఉన్న కామన్ ఎనిమీ జగన్ మాత్రమే.
దీంతో జగన్ (CM Jagan) మీద పోటీకి ఎవరిని దించుతారు అనేది ఎప్పటి నుంచో ఆసక్తికరంగా ఉన్న విషయం. ఇవాళ ఎనౌన్స్ చేసిన లిస్ట్‌తో ఆ సస్పెన్స్‌కు కూడా బ్రేక్ వేశారు చంద్రబాబు. పులివెందుల నుంచి జగన్‌కు పోటీగా టీడీపీ నుంచి మారెడ్డి రవీంధ్రనాథ్ (Mareddy Rabindranath) అలియాస్ బీటెక్ రవి (BTech Ravi) ని బరిలో దింపబోతున్నారు. కడప జిల్లా కసునూరు గ్రామానికి చెందిన మారెడ్డి కృష్ణా రెడ్డి, సరస్వతమ్మ కొడుకే ఈ బీటెక్ రవి. టీడీపీతో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రవి.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ టీడీపీలోనే కంటిన్యూ అవుతున్నారు. 1992లో కర్నాకటలోని ధార్వాడ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ కంప్లీట్ చేశారు. అప్పటి నుంచి ఆయనను అంతా బీటెక్ రవి అని పిలుస్తుంటారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి రవి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయి వివేకానందరెడ్డి మీద పోటీ చేసి గెలిచారు.
వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉండే పులివెందుల నుంచి వైఎస్‌ఆర్ కుటుంబ సభ్యుడిపై పోటీ చేసి గెలిచాడు రవి. దీంతో పార్టీలో రవికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఈ ఎన్నికల్లో జగన్ ఎక్కడ పోటీ చేస్తే తాను కూడా అక్కడే పోటీ చేస్తానంటూ రవి చాలా కాలంగా చెప్తూ వస్తున్నారు. పులివెందులలో రవికి ఉన్న ఓట్‌బ్యాంక్ దృష్ట్యా రవిని దింపితేనే బెటర్ అని చంద్రబాబు కూడా డిసైడ్ అయ్యారు. దీంతో పులివెందుల అభ్యర్థిగా రవి పేరును ఎనౌన్స్ చేశారు. కానీ జగన్ మీద పోటీ అంటే వివేకాతో పోటీ పడ్డంత ఈజీ మాత్రం కాదు. మరి వచ్చే ఎన్నికల్లో పులివెందుల ప్రజలు ఎలాంటి తీర్పు చెప్తారో చూడాలి.