ఈ మధ్య సోషల్ మీడియాలో కొందరు వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. వ్యూస్ కోసం కాస్త భిన్నంగా ఆలోచించి ఇరుక్కుపోతున్నారు. తాజాగా ఒక యువకుడు నెమలి కూరా అంటూ వీడియో అప్లోడ్ చేసి ఇరుక్కుపోయాడు. తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన “sri Tv” యూ ట్యూబ్ చానెల్ కోడం ప్రణయ్ కుమార్ ఈ వీడియో చేసాడు. నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి” అంటూ ఛానల్లో ప్రణయ్ వీడియో పోస్ట్ చేసాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
చర్యలు తీసుకోవాలంటూ జంతు ప్రేమికులు ఫైర్ అవుతున్నారు. హుటాహుటిన ప్రణయ్ ని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ పక్షి నెమలి కావడంతో కేసు నమోదు చేసిన ఫారెస్ట్ అధికారులు… ప్రణయ్ ని రిమాండ్ కి తరలించారు. కర్రీ వండిన స్పాట్ కి వెళ్లి పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు… వండిన కూరను స్వాధీనం చేసుకున్నారు.