Chandrababu : ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా..!

ఫైబర్ నెట్ కేసు (fiber net case) లో టీడీపీ (TDP) అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరుగుతుంది.

ఫైబర్ నెట్ కేసు (fiber net case) లో టీడీపీ (TDP) అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరుగుతుంది. ఇటెం నెంబర్ 11 గా లిస్ట్ అయిన ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం విచారించింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో పిటిషన్ దాకాలు చేయగా.. హైకోర్టు ఈ పిటిషన్ ను తిరస్కరించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తీర్పును వెలువరించే వరకు ఆగాలని గత విచారణలో ధర్మాసనం వెల్లడించింది. కాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. ఈకా ఈ నేపథ్యంలో నేటి విచారణలో సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. కాగా ఈ నెల 30 వరకు చంద్రబాబును ఫైబర్ నెట్ కేసులో అరెస్ట్ చేయొద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Ponguleti Srinivas Reddy : పొంగులేటిపై ఐటీ రెయిడ్స్.. రెండు రోజుల ముందే లీక్..?

మరోవైపు చంద్రబాబు తరఫు న్యాయవాది.. సుప్రీంకోర్టులో కేసు ముగిసే వరకు అరెస్ట్ చేయబోమని నిబంధన కొనసాగించాలని లాయర్ సిద్ధార్థ లూథ్రా సుప్రీం కోర్టుకు తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఈనెల 23 లోగా తీర్పు వచ్చే అవకాశం ఉంది అని.. కేసు కొట్టేయాలని చంద్రబాబు పెట్టుకున్న 17ఏ పిటిషన్.. ఈ నెల 11వ తేదీ నుంచి సుప్రీంకోర్టుకు వరుస సెలవులు ఉండటంతో ..దీపావళి సెలవుల అనంతరం స్కిల్ డెవలప్ కేసు తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.