Weather Update : దేశ వ్యాప్తంగా విస్తార వర్షాలు.. ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వాతావరణం (Weather) చల్లగా మారిపోయింది.

దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వాతావరణం (Weather) చల్లగా మారిపోయింది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో గత రెండు మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, నదులు పొంగిపోర్లుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆదివారం (జూన్ 9) మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ముంబైతో సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు దక్షిణ గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలతో సహా తెలంగాణలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ క్రమంలోనే రానున్న ఐదు రోజుల్లో మహారాష్ట్ర , కర్ణాటక లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ (IMD) వివరించింది. అలాగే రాబోయే 2 రోజుల్లో భారత దేశం లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో.. మరి ముఖ్యంగా రానున్న 4-5 రోజుల్లో కోస్తాంధ్ర, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు హెచ్చరిక పొంచి ఉన్నాయి. దీంతో కర్ణాటక లోని ప్రధాన ఆయకట్టు ఆల్మట్టి డ్యాంకు భారీగా వరద నీరు వస్తుందని ఐఎండీ తెలిపింది. దీంతో కర్ణాటక నుంచి దిగువ ప్రాంతం అయిన తెలంగాణలోకి భారీగా వరద ప్రవాహ పొంచి ఉంటుందని కృష్ణా నది (Krishna river) పరివాహక ప్రాంత వాసులు జాగ్రత ఉండాలని చూసించింది. ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణలోని ప్రధాన ఆయకట్టు అయిన జూరాల డ్యాంకు (Jurala Dam) కృష్ణ నది వరద నీరు క్రమం క్రమంగా పెరుగుతందని తెలంగాణ నీటిపారుదల శాఖ వెల్లడించింది.

ఇక నైరుతి రుతు పవనాల ప్రభావంతో వచ్చే 4-5 రోజులు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. వాయువ్య మధ్యప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లో తుపాను ఏర్పడే అవకాశాలున్నాయి. వాటి ప్రభావంతో బీహర్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మద్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో రానున్న 4-5 రోజుల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడనున్నాయి దేశ వాతావరణ శాఖ హెచ్చిరికలు జారీ చేసింది. జూన్ 12 తరువాత బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి వర్షాలు కురువనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. మరో పై నైరుతి రుతు పవనాల ప్రభావంతో భారీ వర్షాలు.. ఉదురు గాలులు వీయనుండటంతో మత్య్సకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్లకుడదని హెచ్చిరికలను జారీ చేసింది.