ఏపీకి మూడు తుఫాన్ల ముప్పు…?

అక్టోబర్ 10 తర్వాత ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు

  • Written By:
  • Publish Date - October 7, 2024 / 10:42 AM IST

అక్టోబర్ 10 తర్వాత ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అరేబియాలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 20 రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్ళకుండా ఉండటం మంచిది అని సూచిస్తున్నారు.

ఆదివారం పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు పడినా వీటి తీవ్రత చాలా తక్కువ. కాని 10 నుంచి పడే వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ ప్రభావంతో రాగల 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. తుఫాన్ ల ప్రభావంతో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది.