Hyderabad Heavy rains : హైదరాబాద్ లో వర్షం.. పట్టపగలే చీకటి కమ్ముకున్న భాగ్యనగరం..

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. గురువారం తెల్లవారు జాము నుంచే ఆకాశం మేఘవృతం అయ్యింది. పట్టపగలే చీకటి కనుక్కుంది భాగ్య నగరంలో. నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, పంజాగుట్ట సహా పలు చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి.

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. గురువారం తెల్లవారు జాము నుంచే ఆకాశం మేఘవృతం అయ్యింది. పట్టపగలే చీకటి కనుక్కుంది భాగ్య నగరంలో. నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, పంజాగుట్ట సహా పలు చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. ఇక బేగంపేట, ప్యాట్నీ, అల్వాల్, తిరుమలగిరి, కూకట్ పల్లి, హైదర్నగర్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, అమీర్ పేట్, బోయిన్పల్లి, మారేడ్పల్లి, చిలుకలగూడ, జీడిమెట్ల, ఆల్విన్ కాలనీ, బాచుపల్లి, నిజాంపేట్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది కుత్బుల్లాపూర్, బంజారాహిల్, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి నగరంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి వాన హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోనూ పలు చోట్ల వర్షం కురుస్తుంది. ఈశాన్య రుతుపవనాల కారణంగా ఈ మార్పులు చోటుచేసుకున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Telugu States Light Rains : తెలుగు రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్ష సూచన..

హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం..?

హైదరాబాద్లో పలుచోట్ల ఇప్పటికే వర్షం కురుస్తోంది. మలక్పేట్, దిల్సుఖ్నగర్, మాసబ్ ట్యాంక్, మీర్పేట్, బాలాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. రాబోయే 2, 3 గంటల్లో మరిన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో వర్షం వల్ల కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

భాగ్యనగరవాసులకు ఉపశమనం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతావరణం. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా.. హైదరాబాద్ మొత్తం మేఘాలతో కమ్ము కుంది. దీంతోపాటు హుస్సేన్ సాగర తీరంలో చల్లటి గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణాన్ని నగరవాసులు తేగా ఎంజాయ్ చేస్తున్నారు.