Heavy rains : వచ్చే 5 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో వర్షాలు రెడ్ అలర్ట్ జారీ

తెలంగాణలో 3 రోజులు వర్షాలు రాష్ట్రంలో నేటి నుంచి మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ నిజామాబాద్, సిరిసిల్ల, నల్గొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఉరుములు, మెరుపులతో పాటు 30-40kmph వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

రానున్న 5 రోజులు పలు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశాతోపాటు కోస్తా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్లో 3 రోజులుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

తెలంగాణలో భారీ వర్షాలు..

తెలంగాణలో 3 రోజులు వర్షాలు రాష్ట్రంలో నేటి నుంచి మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ నిజామాబాద్, సిరిసిల్ల, నల్గొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఉరుములు, మెరుపులతో పాటు 30-40kmph వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు..

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో నేడు (సోమవారం) పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, ఏలూరు, నంద్యాల, అనంతపురం, వై.ఎస్.ఆర్, సత్యసాయి, తిరుపతి, పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.