ఏపీ ముందు భారీ ముప్పు

ఈ రోజు, రేపు కోస్తాంద్రకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కొన్ని చోట్ల అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా ప్రకటించారు అధికారులు.

  • Written By:
  • Publish Date - September 8, 2024 / 12:18 PM IST

ఈ రోజు, రేపు కోస్తాంద్రకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కొన్ని చోట్ల అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా ప్రకటించారు అధికారులు. అల్లూరి సీతారామ రాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కొనసీమ, కృష్ణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసారు. ఆయా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల.. ఆయా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రేపు కూడా శ్రీకాకులం నుంచి ఎన్టీఆర్, కృష్ణ జిల్లాల వరకు భారీ వర్ష సూచన చేసారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.