Hyderabad Heavy Rains : 24 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షాం.. ఈ జిల్లాలు జాగ్రత

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి తేలికపాటి చినుకులు కురుస్తున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి తేలికపాటి చినుకులు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రాత్రి నుంచి చలిగాలులు వీచాయి.

24 గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ లో ప్రధానంగా.. మెహదీపట్నం, అత్తాపూర్, మాసబ్ ట్యాంక్, టోలీ చౌకి, ఫిల్మ్ నగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, అమీర్ పేట్, కూకట్ పల్లి, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. మరో 3 నుంచి 4 రోజులు హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మెదక్, శంషాబాద్, రంగారెడ్డి, రాజేంద్రనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉండనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రేపు ఏప్రిల్ 14న తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 34.6, కనిష్ఠం 24.9 డిగ్రీలు, గాలిలో తేమ 42 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఇక జగిత్యాల, కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రానున్న 2 గంటల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే అకాల వర్షాలతో వరి, మామిడి పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు.