హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈరోజు(సోమవారం) నగరంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, నిన్న(ఆదివారం) రాత్రి ముషీరాబాద్, ఆసిఫ్నగర్, షేక్పేట్, అంబర్పేట్, బహదూర్పురా, సైదాబాద్, బండ్లగూడ, హిమాయత్నగర్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. దీంతో అప్రమత్తమైన GHMC సిబ్బంది చెట్లను తొలగించారు.
కాగా ఇవాళ రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనంతో పాటు 2రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రానికి రానున్నాయి. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, VKR, MBNR, RR, నారాయణపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు ఇతర జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. గంటకు 30-50 కి.మీ గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.