తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలతో పాటు మరికొన్ని చోట్ల ఒక మోస్తరు వర్సాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని జిల్లాలలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ మరో మూడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని.. వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. రేపు కూడా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రేపు ఏపీలో భారీ వర్షాలు…
రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.