Kedarnath 2023 : కేదార్​నాథ్​లో భారీ హిమపాతం.. విరిగి పడుతున్న మంచుచరియలు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన చోటా చార్ ధామ్ యాత్రలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న బద్రినాథ్ వెళ్తున్న ఓ ప్రైవేట్ వాహనం రుద్రప్రయాగ్ జిల్లాలోని అలకనంద నది సంగంలోకి వాహనం దూసుకెళ్లిన విషయం తెలిసిందే.. తాజాగా కేధార్ నాథ్ లో భారీ హిమపాతం జరిగింది. కేధార్ నాథ‌ ఆలయం వెనకల ఉన్న భారీ మంచు కొండ ఒక్కసారిగా విరిగిపడిపోయింది.

ఇక విషయంలోకి వెళితే..

భారత దేశ తలమానికంగా ఉన్న రాష్ట్రంలో హిమలయా రాష్ట్ర అయిన ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా ఒకటి.. పర్యటాక ప్రాంతాలకు.. పుణ్యక్షేత్రాలు.. ప్రకృతి అందాలకు.. హిమాలయ పర్వత అధిరోహణకు అందమైన అద్భుత ప్రదేశం.. ఉత్తరాఖండ్. ఇక్కడే భారత దేశపు చోటా చార్ ధామ్ యాత్ర కూడా ప్రతి సంవత్సరం 6 నెలలు జరుగుతుంది. ఈ సంవత్సరంలో మార్చ్ లో 12న చోటా చార్ ధామ్ యాత్రలో అతి ముఖ్యమై కేధార్ నాథ్ యాత్ర కూడా ప్రారంభమైన విషయంత తెలిసిందే. తాజాగా కేధార్ నాథ్ లో భారీ హిమపాతం సంభవించింది.

కేదార్‌నాథ్‌ ఆలయానికి 4కిలోమీటర్ల పైనున్న గాంధీ సరోవరం వద్ద భారీ మంచుచరియ విరిగిపడింది. ఉదయం 5గంటల సమయంలో సంభవించింది. ఒక్కసారిగా మంచు పెళ్లలు విరిగి కొండల మీద నుంచి జారిపడ్డాయి. అయితే కేదార్​నాథ్ ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదని బద్రీనాథ్-కేదార్​నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు. కేదార్‌నాథ్‌ ఆలయానికి వెళ్లిన భక్తులు తమ మొబైల్‌ ఫోన్లలో హిమాపాతంకు సంభందించిన దృశ్యాలను బందించారు. కాగా ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని రుద్రప్రయాగ్‌ జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ అధికారి నందన్‌సింగ్‌ రాజ్‌వార్‌ తెలిపారు. ముందు జాగ్రత్తలో భాగంగా విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించారని పేర్కొన్నారు. కేదార్‌నాథ్ లోయతో సహా మొత్తం ప్రాంతం భద్రంగా ఉందని తెలియజేశారు.