తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణాలు.. ఉదయం మండుటెండలు భగ్గుమని పిస్తుంటే.. సాయంత్ర సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతు ఈదురు గాళ్లులతో.. మొదలైన వర్షం భారీ వర్షంగా కురుస్తుంది.
నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ (weather) అధికారులు తెలిపారు. తూర్పు నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, అల్లూరి, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, జిల్లాల్లో వానలు కురుస్తాయని.. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురిసే సమయంలో భారీగా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక.. తెలంగాణలో తేలికపాటి (light rain) నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు. కాగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షపాతం నమోదవగా.. ఉరుములు, మొరుపులతో వాన బీభత్సాన్ని సృష్టించింది. అత్యధికంగా హైదరాబాద్ లోని మియాపూర్ లో 13.3 శాతం నమోదవగా, ఏటురునాగారంలో 4.4 శాతం వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో మూడు గంటల పాటు భారీ వర్షం కురిసింది. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 10.8, కేపీహెచ్పీలో 10.73, సికింద్రాబాద్లో 8.4, అల్వాల్లో 7, గాజులరామారంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, సిద్దిపేట జిల్లాల్లో 6 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు (Hail showers) పడ్డాయి.
SSM