ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు.. టీడీపీ వాళ్లవే.. ఇదిగో ప్రూఫ్‌!

వరదలో రాజకీయ దురద అంటే ఇదేనేమో అనుకుంటున్నారు జనాలు.. ఏపీ రాజకీయ పరిణామాలు చూసి. వరదలో కొట్టుకు వచ్చిన బోట్లు.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయ్‌. డ్యామేజీ జరిగింది కూడా ! ఐతే బోట్లు కూడా ఇప్పుడు రాజకీయం అవుతున్నాయ్.

  • Written By:
  • Publish Date - September 9, 2024 / 10:36 PM IST

వరదలో రాజకీయ దురద అంటే ఇదేనేమో అనుకుంటున్నారు జనాలు.. ఏపీ రాజకీయ పరిణామాలు చూసి. వరదలో కొట్టుకు వచ్చిన బోట్లు.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయ్‌. డ్యామేజీ జరిగింది కూడా ! ఐతే బోట్లు కూడా ఇప్పుడు రాజకీయం అవుతున్నాయ్. ఓ వైపు వరదలో చిక్కుకున్న జనాలు ఆర్తనాదాలు చేస్తుంటే.. రాజకీయ పార్టీలు మాటలు మాత్రం వరదను వదిలేసి.. రాజకీయ బురద రుద్దుకుంటున్నాయ్. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు వైసీపీ వాళ్లవే అని టీడీపీ నేతలు.. కాదు ఆ బోట్ల ఓనర్ టీడీపీ నేతే, లోకేశ్‌కు దగ్గర అంటూ వైసీపీ.. ఎవరివి వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. బోట్లు ఢీకొట్టి కుట్ర చేశారని.. ఇందులో పాల్గొంది వైసీపీ కీలక నేత తలశిల రఘురాం బంధువులు, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు అని టీడీపీ నేతలు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. వరద వచ్చే ముందు రోజు ఉద్దండరాయుని పాలెం వైపు గట్టున ఉండే పడవలను.. గొల్లపూడి వైపు తరలించారని చెప్తున్నారు.

భారీ పడవలను కేవలం ప్లాస్టిక్ రోప్‌తో కట్టి లంగరు వేశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనికి వైసీపీ కూడా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తోంది. ప్రకాశం బ్యారేజీ దగ్గరకు వరదకు కొట్టకొచ్చిన బోట్ల కేసు నిందితుడు నారా లోకేశ్‌కు సన్నిహితుడు అంటూ.. వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకురావడం వెనక కుట్రకోణం ఉందంటూ గత అర్థరాత్రి పోలీసులు కోమటి రామ్మోహన్‌, ఉషాద్రిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో రామ్మోహన్‌ పేరుమీద ఒక్క బోటు కూడా లేదని.. ఉషాద్రికి వైసీపీతో సంబంధాలు లేవని.. నారా లోకేశ్‌కే ఆయన క్లోజ్ అంటూ వైసీపీ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇలా ఎన్ని జిత్తుల మారి వేషాలేసినా.. విజయవాడని ముంచిన పాపాన్ని కడుక్కోలేరు అంటూ ఘాటు కామెంట్లు చేసింది. ఇలా వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య బోటు యుద్దం పీక్స్‌కు చేరుకుంటోంది. విజయవాడ కన్నీటితో తడిసిపోతుంటే.. ఇది రాజకీయాలు మాట్లాడుకునే సమయమా.. బాధితులను ఆదుకోవడంలో పోటీ పడండి.. బోట్ల ఘటన వెనక నిజంగా కుట్ర ఉంటే.. తేలుతారు కదా.. ఈ యుద్దం ఏంటి అంటూ.. సోషల్‌ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.