Ravi Teja Accident : హీరో రవితేజ కుడి చేతికి గాయం.. ఆందోళనలో అభిమానులు.. ఏం జరిగిందంటే..

తాజాగా హీరో రవితేజ (Ravi Teja) కుడి చేతికి గాయం అవడంతో యశోద ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆరు వారాలపాటూ విశ్రాంతి తీసుకోవాలని సర్జరీ చేసిన ప్రత్యేక డాక్టర్ల బృందం సూచించింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaj Ravi Teja) .. ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు.. ఇప్పుడు ఆ హీరోకి ఏం అయ్యింది. సోషల్ మీడియాలో తెగ చర్చలు..

  • రవితేజ కి యాక్సిడెంట్ జరిగింది అని ఒకరు..
  • రవితేజ కు సర్జరీ జరిగిందని మరొకరు..
  • రవితేజ ICU లో ఉన్నారు అని మరి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

తాజాగా హీరో రవితేజ (Ravi Teja) కుడి చేతికి గాయం అవడంతో యశోద ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆరు వారాలపాటూ విశ్రాంతి తీసుకోవాలని సర్జరీ చేసిన ప్రత్యేక డాక్టర్ల బృందం సూచించింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. హీరో రవితేజ నటించిన బచ్చన్ (Mr Bachchan) సినిమా తాజాగా విడుదలై ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయితే రవితేజ 75వ (RT75) సినిమా షూటింగ్‎ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కుడిచేతికి గాయం అయింది. దానిని లెక్కచేయని హీరో రవితేజ తన సినిమా షూటింగ్‎ (Film shooting) ను కొనసాగించారు.

ఈ తరుణంలోనే కుడిచేతి గాయం ఎక్కువ కావడంతో హైదరాబాద్ (Hyderabad) లోని యశోద ఆస్పత్రి (Yashoda Hospital) లో రవితేజ కుడిచేతికి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఆపరేషన్ (operation) అనంతరం ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు రవితేజకు సూచించారు. దీంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా షూటింగ్ కొన్ని రోజుల పాటు వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. ఈలోపు రవితేజకు సంబంధించిన సీన్లు కాకుండా ఇతర నటీనటులకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించేందుకు సిద్దమైంది చిత్ర యూనిట్. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు ఆయన సన్నిహితులు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవితేజ త్వరగా కోలుకోవాలంటూ.. అభిమానులు సోషల్ మీడియా (Social media) లో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.