Nani: టాలీవుడ్ లో రిలీజ్ డేట్ కబ్జా

సెట్స్ పై ఉన్న సినిమాలకు రిలీజ్ డేట్ల పంచాయితీ పెద్ద తలనెప్పిగా మారింది. ఒక తేదీ ప్రకటించి నిశ్చింతగా ఉండటానికి లేదు. ఏ పెద్ద హీరో ఆ డేట్ ని కబ్జా చేస్తాడో అన్న టెన్షన్ తో రోజులు గడపాల్సి వస్తోంది. ఇప్పుడు ఇదే మ్యాటర్ హాయ్ నాన్నకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. మరో డేట్ ని వెతుక్కోవడం అంతకన్నా పెద్ద సమస్యగా మారుతోంది.

  • Written By:
  • Publish Date - October 6, 2023 / 08:17 AM IST

సెట్స్ పై ఉన్న సినిమాలకు రిలీజ్ డేట్ల పంచాయితీ పెద్ద తలనెప్పిగా మారింది. ఒక తేదీ ప్రకటించి నిశ్చింతగా ఉండటానికి లేదు. ఏ పెద్ద హీరో ఆ డేట్ ని కబ్జా చేస్తాడో అన్న టెన్షన్ తో రోజులు గడపాల్సి వస్తోంది. ఇప్పుడు ఇదే మ్యాటర్ హాయ్ నాన్నకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. మరో డేట్ ని వెతుక్కోవడం అంతకన్నా పెద్ద సమస్యగా మారుతోంది.

దసరా బ్లాక్ బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న క్లాసిక్ మూవీ హాయ్ నాన్న. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ తో ఫీల్ గుడ్ ప్రాజెక్ట్ ని ఆడియన్స్ కి అందించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఆడియాన్స్ ని థ్రిల్ చేసింది. సాంగ్ కూడా భారీ బజ్ ని క్రియేట్ చేసింది. కానీ రిలీజ్ డేటే కొత్త తలనొప్పులకు సెంటర్ గా మారింది.

హయ్ నాన్న ని డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు.కానీ అనూహ్యంగా ఆ తేది కి ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్ అవుతోంది. దీంతో డైనొసర్ కి పోటీగా హాయ్ నాన్న ని విడుదల చేయడం అంటే కోరి డిజాస్టర్ ని కొని తెచ్చుకోవడమే. అందుకే రిలీజ్ డేట్ విషయంలో హాయ్ నాన్న మేకర్స్ సందిగ్థంలో పడ్డారు.

హాయ్ నాన్న మూవీని డిసెంబర్ 1న రిలీజ్ చేద్దాం అనుకుంటే అదే రోజు రణబీర్ కపూర్ యానిమల్ మూవీ వస్తుంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్ కావడంతో తెలుగులో ఈ మూవీకి భారీ డిమాండ్ ఉంది. పోనీ సెకండ్ వీక్ కి వెళ్దామంటే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు రిలీజ్ కోసం రెడీగా ఉన్నాయి. అయితే డిసెంబర్ 15న ధనుష్ కెప్టెన్ మిల్లర్ మాత్రమే రిలీజ్ అవుతొంది. కొద్దిలో కొద్దిగా ఆ డేట్ మాత్రమే కొంత సేఫ్ గా కనిపిస్తోంది. సలార్ వల్ల డేట్ మార్చుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితిలో నాని హాయ్ నాన్న డిసెంబర్ 15 గురించి సీరియస్ గా ఆలోచిస్తోంది.మరి మేకర్స్ ఏ డేట్ ని ఫైనల్ చేస్తారో చూడాలి.