చార్మినార్ కూల్చమంటే కూలుస్తారా…? హైడ్రాపై హైకోర్ట్ సీరియస్

హైకోర్టులో హైడ్రాపై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వర్చువల్‌గా హాజరైన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ పై, అమీన్‌పూర్‌ తహశీల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Written By:
  • Publish Date - September 30, 2024 / 01:15 PM IST

హైకోర్టులో హైడ్రాపై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వర్చువల్‌గా హాజరైన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ పై, అమీన్‌పూర్‌ తహశీల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోపే ఎలా కూల్చుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేనడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాలంటూ హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు చురకలు అంటించింది.

చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే కూల్చేస్తారా అంటూ హైడ్రా కమిషనర్‌ను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. దేశంలో ఎక్కడైనా ఆదివారాలు కూల్చివేత చేపడుతార అని నిలదీసింది. ఆదివారాలు మీరు ఎందుకు పని చేస్తున్నారు , సోమవారం కూల్చివేత చేయచ్చు కదా అని ప్రశ్నించింది. మీకు అసలు రూల్స్ తెలుసా తెలీదా ? అని నిలదీసింది కోర్ట్.