ఇది బెట్టింగ్ రాయుళ్లకు వరంగా మారింది. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయన్న దానిపై.. వేల కోట్లలో బెట్టింగ్‌లు సాగుతున్నాయ్. కాంగ్రెస్‌దే అధికారం అని ఎగ్జిట్‌పోల్స్ చెప్తున్నాయ్. అదే జరిగితే ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న దానిపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఎన్నికలకు ముందే బెట్టింగ్ బ్యాచ్‌లు రంగంలోకి సర్వేలు చేశాయ్. ఫలోడి, కోల్‌కతా, బెల్గాం, ఫలాన్‌పూర్, కర్నాల్, బోహ్రీ నుంచి బెట్టింగ్ బ్యాచ్‌లు కర్ణాటకకు వచ్చి సర్వేలు చేశాయ్. అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్‌దే అధికారం అని తేలింది. దీంతో కాంగ్రెస్ మీద భారీ బెట్టింగ్స్ సాగుతున్నాయ్.
ఓవరాల్‌గా పది వేల నుంచి 20వేల కోట్ల బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ఆంధ్ర, చెన్నై నుంచి కూడా బెంగళూరు సిటీలో తిష్టవేశాయ్. బెట్టింగ్‌ల్లో ఆప్షన్ తీసుకొస్తూ.. పందేలు కొనసాగిస్తున్నాయ్. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అధిక మొత్తంలో బెట్టింగ్ జరుగుతోంది. లక్ష బెట్టింగ్ వేస్తే.. లక్ష ఇచ్చేలా పందేలు కొనసాగుతున్నాయ్. ఐపీఎల్‌కు మించి కర్ణాటక ఎన్నికల ఫలితాల బెట్టింగ్‌లు సాగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. కర్ణాటకతో పాటు.. ఏపీ, తెలంగాణ, ముంబై, చెన్నైలోనూ ఫలితాల మీద వేల కోట్లలో పందేలు సాగుతున్నాయ్.