దేశ సార్వత్రిక ఎన్నికల (National General Elections) వేళ హైదరాబాద్ పై ప్రధాన మంత్రి నరేంద్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం అనేది తెలంగాణకే కాదు.. భారత దేశానికే అతి ప్రధానమైన నగరం అని ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వూలో చెప్పుకోచ్చారు. హైదరాబాద్ కు దేశ వ్యాప్తంగా వచ్చి ఇక్కడ జీవనం.. ఉపాధి సాగిస్తున్నారు. అలాగే హైదరాబాద్ నగరం ఐటీ కారిడార్ కి ప్రసిద్ధి చెందింది. మా ప్రభుత్వం ఇటివలే హైదరాబాద్ – విజయవాడ – తిరుపతి కి వందే భారత్ రైళ్లు నడిపిస్తున్నం.. కాగా హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చెందాలని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకోచ్చారు.
హైదరాబాద్ కు హైస్పీడ్ రైలు..
పీఎం మోదీ (Narendra Modi) కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హైస్పీడ్ రైల్ (IT Corridor) కారిడార్లో భవిష్యత్తులో హైదరాబాద్ కూడా భాగం కానుందని ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘తెలంగాణకే కాక భారత్ కు కూడా హైదరాబాద్ ఓ అభివృద్ధి కేంద్రం. ఆ సిటీని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లకు అనుసంధానం చేయాలన్న ఆలోచన ఉంది. ఆ దిశగా కేంద్రం పనిచేస్తోంది. ఇక ‘వందే మెట్రో’ ప్రయోజనాలు కూడా హైదరాబాద్ పొందుతుంది’ అని పేర్కొన్నారు. ఈ నగరాని హైస్పీడ్ రైలు కారిడార్ గా చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. భారత దేశానికి హైదరాబాద్ అనేది అభివృద్ధి కేంద్ర.. గొప్ప పర్యటక కేంద్ర అని వ్యాఖ్యానించారు.
SSM