Kangana Ranaut : కంగనా రనౌత్‌కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు… కంగనాను అనర్హులరాలిగా ప్రకటించాలి

ప్రముఖ బాలీవుడ్(Bollywood) నటి, హిమాచల్ ప్రదేశ్ లోని మండి బీజెపి ఎంపీ కంగన రనౌత్ కు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) హైకోర్ట్ షాక్ (High Court) ఇచ్చింది.

ప్రముఖ బాలీవుడ్(Bollywood) నటి, హిమాచల్ ప్రదేశ్ లోని మండి బీజెపి ఎంపీ కంగన రనౌత్ కు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) హైకోర్ట్ షాక్ (High Court) ఇచ్చింది. మండి నియోజకవర్గం (Mandi Constituency) ఎంపీ కంగనా రనౌత్‌కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కంగనా రనౌత్‌ (Kangana Ranaut) మండి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ (BJP) ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన సంగ‌తి తెలిసిందే. మండిలో స్వతంత్ర అభ్యర్థిగా తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారని మండికి చెందిన లాయక్ రామ్ నేగి పిటిషన్ వేశారు. అందులో కంగనా ఎన్నికను సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు దీనిపై ఆగస్టు 21లోగా బదులు ఇవ్వాలని కంగనాకు నోటీసులు ఇచ్చింది.

మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను కావాలనే పక్కన పెట్టేశార‌ని, కిన్నౌర్ నివాసం లాయక్ రామ్ నేగి ఆరోప‌ణ‌లు చేశారు. అటవీ విభాగంలో పనిచేసిన నేగి ఎన్నికల బరిలోకి దిగేందుకు ముందస్తుగా ఉద్యోగం నుంచి తప్పుకోవాలని ఆ తర్వాత ఎన్నికల పోటీ చేసే అర్హత పొందుతాడని చెప్పడంతో.. వెంటనే నామినేషన్ పత్రాలతోపాటు డిపార్ట్‌మెంట్ ఇచ్చిన ‘నో డ్యూ’ సర్టిఫికెట్‌ను కూడా తీసుకోచ్చాడు. అయితే, విద్యుత్, తాగునీరు, టెలిఫోన్ విభాగాల నుంచి కూడా సర్టిఫికెట్లు తీసుకురావాలని చెబుతూ రిటర్నింగ్ అధికారి ఒక రోజు గడువిచ్చారు. ఆ లోపే తాను వాటిని తీసుకెళ్లానని, కానీ రిటర్నింగ్ అధికారి వాటిని తీసుకునేందుకు నిరాకరించారని నేగి తన పిటిషన్‌లో ఆరోపించారు. దీంతో తనకు అన్యాయం జరిగిందని.. కంగనా ర‌నౌత్‌ను అనర్హులరాలిగా ప్రకటించాలని లాయక్ దాఖ‌లు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. ఇక‌, ఈ విష‌యంపై విచార‌ణ జ‌రిపిన హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ హైకోర్టు ఆగస్టు 21లోగా దీనిపై వివరణ ఇవ్వాలంటూ బిజెపి ఎంపీ కంగ‌నా ర‌నౌత్‌ను ఆదేశించింది. కాగా మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ను 74వేలకుపైగా ఓట్ల తేడాతో కంగనా ర‌నౌత్ ఓడించిన సంగ‌తి తెలిసిందే.

Suresh SSM