Holi celebrations‎: హోలీ వేడుకలు.. వైన్స్ షాపులు బంద్.. ఎప్పటివరకు..?

వైన్స్‌తోపాటు బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసి ఉంటాయి. ఈ మేరకు మద్యం షాపుల, బార్ల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్‌తోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి ఉంటాయి.

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 05:11 PM IST

Holi celebrations‎: దేశవ్యాప్తంగా పలు చోట్ల అప్పుడే హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ హోలీ సందడి కనిపిస్తోంది. దీంతో తెలంగాణకు సంబంధించి జంట నగరాల్లో వైన్స్ షాపులు మూతపడనున్నాయి. సోమవారం హోలీ కాబట్టి.. ఆదివారం సాయంత్రం నుంచి జంట నగరాల్లో వైన్స్ షాపులు మూతపడనున్నాయి. ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు వైన్స్ మూసి ఉంటాయి.

YSRCP MLA’S: వైసీపీ ఎమ్మెల్యేలు జంప్.. బీజేపీలో చేరిన గూడూరు ఎమ్మెల్యే

వైన్స్‌తోపాటు బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసి ఉంటాయి. ఈ మేరకు మద్యం షాపుల, బార్ల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్‌తోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి ఉంటాయి. అయితే, స్టార్ హోటల్స్, రిజిస్టర్ట్ క్లబ్బులు మాత్రం ఎప్పటిలాగే పని చేస్తాయి. హోలీ వేడుకల సందర్భంగా మద్యం మత్తులో ఎలాంటి నేరాలు, అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రోడ్లపై ఇష్టారీతిన హోలీ వేడుకలు జరుపుకోవద్దని, రోడ్లపై వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని పోలీసులు సూచించారు. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు హోలీ పండుగ సందర్భంగా, మార్చి 25 సోమవారం తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అనంతరం మార్చి 29న గుడ్‌ఫ్రైడే సందర్భంగా కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మార్చి 31న ఈస్టర్ పండుగ నిర్వహించనుండడం తెలిసిందే.