దీంతో టైటానిక్ మునిగి ఉన్న ప్రాంతం గురించి జేమ్స్ కేమరూన్ చెప్పిన విషయాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. టైటానిక్ సినిమా తీసిన కామెరూన్ పసిఫిక్ మహాసముద్రంలో ఆ షిప్ మునిగిన ప్రాంతానికి 33 సార్లు వెళ్లారట. మొదటి సారిగా రష్యన్ సబ్ మెరైన్‌లో ఆ ప్రాంతానికి ఆయన వెళ్లి ఓ డాక్యుమెంటరీ వీడియో తీశారట. ప్రపంపంలోనే అత్యంత క్రూరమైన ప్రాంతాల్లో టైటానిక్ మునిగిన ప్రాంతం కూడా ఒకటని కామెరూన్ చెప్పారు. టైటానిక్ సినిమా తీసినదానికంటే ఆ ప్రాంతాన్ని చూడటమే చాలా అద్భుతంగా అనిపించిదని చెప్పారు.
సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చాలా సినిమాలకు ఆ ప్రాతం క్రూరత్వమే ప్రేరణ అంటూ చెప్పారు కామెరూన్. మునిగిపోయిన టైటానిక్‌ను తాను స్వయంగా చూస్తున్నప్పుడు ప్రపంచంలో తాను ఒక్కడినే ఉన్నానన్న ఫీలింగ్ కలిగిందని కామెరూన్ చెప్పారు. దాదాపు 13 వేల కిలోమీటర్ల లోతులో ఉన్న ఆ షిప్‌ను చూడటం నిజంగా ఓ అద్భుతమంటూ చెప్పారు. ఆ కారణంగానే తాను ఏకంగా 33 సార్లు ఆ ప్రాంతానికి వెళ్లినట్టు చెప్పాడు. కానీ అదే ప్రాంతంలో అదే అనుభూతిని పొందేందుకు వెళ్లిన ఐదుగురు బిలియనీర్లు ప్రమాదవశాత్తూ చనిపోవడం విషాదకరం.