Same-sex marriage : స్వలింగ వివాహాలు అంటే ఏంటి..? చట్టం ఏం చెబుతోంది..?

ప్రపంచ వ్యాప్తంగా ఈ స్వలింగ సంపర్కుల వివాహం పై చాలా దేశాలు చట్టబద్ధత కల్పించాయి. వాటిలో దాదాపు 30కి పైగా దేశాల్లో ప్రస్తుతం అమలులో ఉంది. భారత దేశంలో కూడా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయంపై సుప్రీంకోర్టు గత 5 నెలల క్రితమే వాదనలు జరిపింది. 5 నెలల నుంచి సుదీర్ఘ వాదనల తరువాత తీర్పును మే 11 రిజర్వ్ చేసి ఉంచారు.

స్వలింగ సంపర్కుల వివాహ అంటే ఒకే లింగానికి చెందిన వారు.. ఇద్దరు స్త్రీలు గాని, ఇద్దరు పురుషులు గాని ప్రేమించుకొని సహజీవనం చేస్తే వారిని స్వలింగ సంపర్కులు అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ స్వలింగ సంపర్కుల వివాహం పై చాలా దేశాలు చట్టబద్ధత కల్పించాయి. వాటిలో దాదాపు 30కి పైగా దేశాల్లో ప్రస్తుతం అమలులో ఉంది. భారత దేశంలో కూడా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయంపై సుప్రీంకోర్టు గత 5 నెలల క్రితమే వాదనలు జరిపింది. 5 నెలల నుంచి సుదీర్ఘ వాదనల తరువాత తీర్పును మే 11 రిజర్వ్ చేసి ఉంచారు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తాము ప్రత్యేక వివాహ చట్టం, విదేశీ వివాహ చట్టంలోని చట్టపరమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తున్నామని తెలిపింది.

149 ఏళ్ల క్రితం భారత్ దేశంలో స్వలింగ సంపర్కుల చర్చ..

స్వలింగ సంపర్కుల వివాహం సమస్య ఇప్పటిది కాదు.. 149 ఏళ్ల క్రితం భారతదేశం బ్రిటిష్ పాలకుడు 1860వ సంవత్సరంలో స్వలింగ సంపర్కానికి సంబధించిన ఐపీసీ 377 సెక్షన్ భారత శిక్ష్మా స్మృతిలో ప్రవేశపెట్టారు. ప్రవేశ పెట్టిన తర్వాత 1861 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అప్పుడు న్యాయ స్థానం కీలక మైన తీర్పును వెలువడిచింది. ఎవరైన ప్రకృతికి విరుద్దంగా ఎవరైనా ఇద్దరు పురుషులు గాని, ఇద్దరు స్త్రీలు గాని లైంగికంగా సహాజీవనం చేస్తే వారికి జీవిత కాల శిక్షార్హులు అని ఆదేశాలు జారీ చేసింది.

భారత దేశంలో స్వలింగ సంపర్కులపై తొలి విచారణ..

స్వతంత్ర అనంతరం భారత దేశంలో స్వలింగ సంపర్కుల పై మొట్ట మొదటి పిల్ ను 2001లో స్వలింగసంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ ఎన్‌ఏజడ్‌ ‘నాజ్‌’ ఫౌండేషన్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ‘పిల్‌’ దాఖలు చేసింది. అనంతరం 2004 సెప్టెంబరు 2న ఢిల్లీ హై కోర్టు స్వలింగసంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ పిల్‌ను డిస్మిస్‌ చేసింది. 2009 లో ఢిల్లీ హై కోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఇచ్చిన తీర్పును 2013లో భారత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం నేరమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అలా ప్రతి సంవత్సరం ఈ పిల్ పై ఎదో ఒక్క విచారణ జరగడం.. వాటిని న్యాయస్థానం కొట్టివేయడం ఇలా జరుగుతునే ఉంది. 2009 తర్వాత నేటికీ ఈ పిల్ పై పూర్తిగా స్వలింగ సంపర్కుల వివాహం వారికి అనుకులంగా ఒక్క సారి కూడా తీర్పు రాలేదు.

స్వలింగ సంపర్కుల కు వ్యతిరేకంగా ఉన్న దేశాలు..?

ప్రపంచ వ్యాప్తంగా 53 దేశాలలో కామన్ వెల్త్ దేశాలలో ఇటువంటి వివాహం కు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి 41 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేటికి నేరంగానే పరిగణిస్తున్నారు. గతంలో ఈ తరహా వివాహాలు చేసుకున్న వారిని నైజీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు వారిని జైలు శిక్ష విధించారు.

స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి దేశం..?

స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను చట్టబద్ధం చేసిన మొట్ట మొదటి దేశం డెన్మార్క్. 2001వ సంవత్సరంలో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ తర్వాత ఇదే తరహాలో ఉరుగ్వే, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, కెనడా, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే, పోర్చుగల్, ఫ్రాన్స్, బ్రెజిల్, బెల్జియం, ఐస్ ల్యాండ్, అర్జెంటీనా వంటి దేశాలు తమ న్యాయ స్థానాల్లో ఈ చట్టంను పొందుపరిచారు.

ప్రపంచ వ్యాప్తంగా స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసిన దేశాలు ఏవో తెలుసా..?

  • 2001 : నెదర్లాండ్స్
  • 2003 : బెల్జియం
  • 2005: స్పెయిన్, కెనడా
  • 2006 : దక్షిణాఫ్రికా
  • 2009: నార్వే, స్వీడన్
  • 2010: పోర్చుగల్, అర్జెంటీనా, ఐస్లాండ్,
  • 2012 : డెన్మార్క్
  • 2013: న్యూజిలాండ్, ఉరుగ్వే, ఫ్రాన్స్, బ్రెజిల్
  • 2014 ఇంగ్లాండ్ అండ్‌ వేల్స్, స్కాట్లాండ్
  • 2015 లక్సెంబర్గ్, ఐర్లాండ్,అమెరికా
  • 2016: కొలంబియా, గ్రీన్‌ల్యాండ్,
  • 2017 ఫిన్లాండ్,జర్మనీ, మాల్టా, ఆస్ట్రేలియా
  • 2019: తైవాన్, ఈక్వెడార్, ఆస్ట్రియా
  • 2020 ఐర్లాండ్, కోస్టా రికా
  • 2022: చిలీ, క్యూబా, స్విట్జర్లాండ్, మెక్సికో, స్లోవేనియా
  • 2023 అండోరా
  • 2024: ఎస్టోనియా

భారత్ లో ఈ చట్టం లేనప్పటికీ ఈ తరహాలో పెళ్లి చేసుకున్న భారతీయుడు..

ప్రస్తుత సమాజంలో స్వలింగ సంపర్కం అంటే చాలా కామన్ గా తీసుకుంటారు.
ఇంత‌కుముందు దీన్ని నేరంగా చూసేవారు. కానీ, ఇప్పుడు వారి మ‌న‌సుల‌నూ పెద్ద‌లు అర్థంచేసుకుంటున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఇద్ద‌రు గేలు కుటుంబ స‌భ్యులు, మిత్రుల సమ‌క్షంలో వివాహం చేసుకొని ఒక్క‌టైన విష‌యం తెలిసిందే. కోల్‌క‌తా, గురుగ్రాంకు చెందిన ఇద్ద‌రు స్వ‌లింగ సంప‌ర్క‌లు సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.2019లో భారత దేశానికి చెందిన ఇద్దరు యువకులు అమెరికా న్యూజెర్సీ వేదికగా ఒక్కటైనారు. అంతేనా అంటే వీరు హిందూ సంప్రదాయం ప్రకారం లోనే పెళ్లి చేసుకున్నారు. 2021 లో సమీర్, అమిత్‌లు పెళ్లి చేసుకున్నారు.

S.SURESH