KAVITHA UKKIRI BIKKIRI : ఆప్ కి 100 కోట్లు ఎలా పంపారు ? సీబీఐ ప్రశ్నలతో కవిత పరేషాన్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో ప్రస్తుతం CBI కస్టడీలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత (MLA Kavitha). మొదటి రోజు ఆమెను సీబీఐ (CBI) ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. అప్రూవర్ల స్టేట్ మెంట్స్, కొన్ని ఎవిడెన్సులను చూపించి ఎంక్వైరీ చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో ప్రస్తుతం CBI కస్టడీలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత (MLA Kavitha). మొదటి రోజు ఆమెను సీబీఐ (CBI) ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. అప్రూవర్ల స్టేట్ మెంట్స్, కొన్ని ఎవిడెన్సులను చూపించి ఎంక్వైరీ చేశారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత కీలకసూత్రధారి అని భావిస్తోంది సీబీఐ. డీలర్షిప్ తీసుకున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడం, ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కి 100 కోట్ల రూపాయలను అందించడం లాంటి అనేక అంశాలపై ఆమెను ప్రశ్నించారు అధికారులు. ఆప్ కి అంత డబ్బులు ఇవ్వడానికి… ఇతరుల నుంచి ఎలా వసూలు చేశారు. ఏమని బెదిరించారో క్లియర్ గా చెప్పాలని కోరారు అధికారులు. ఆప్ కి ఆ 100కోట్లు ఎలా పంపారని కవితను ప్రశ్నించినట్టు సమాచారం.

ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారి స్టేట్ మెంట్స్ ఆధారంగా… కొన్ని ఎవిడెన్స్ లను కూడా ముందు పెట్టి కవితను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ప్రభుత్వ అధికారుల జోక్యంపైనా సమాధానాలను రాబట్టే ప్రయత్నం చేశారు. శరత్ చంద్రా రెడ్డి మీకు 14కోట్ల రూపాయలు ఎందుకిచ్చారు. ఆ డబ్బులను ఎక్కడికి తరలించారు… ఢిల్లీలో లిక్కర్ రిటైల్ జోన్లకు 25కోట్లు అడిగారా… ఇవ్వకపోతే మీ బిజినెస్ ఎలా జరుగుతుందో చూస్తా అని శరత్ ను హెచ్చరించారా అని కూడా సీబీఐ అడిగినట్టు తెలుస్తోంది. అలాగే CSR కింద తెలంగాణ జాగృతి సంస్థకు 80 లక్షల రూపాయలను శరత్ చంద్రా రెడ్డి నుంచి వసూలు చేయడంపైనా ఎంక్వైరీ చేశారు. బినామీ అరుణ్ పిళ్ళై ద్వారా కవితకు ఇండో స్పిరిట్ లో వాటాలపైనా సీబీఐ ప్రశ్నించింది. కవిత చాలా ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేదని తెలుస్తోంది. కొన్నింటికి టూకీగా మాత్రమే సమాధానాలు చెప్పినట్టు సమాచారం.

కవితను సీబీఐ ఎంక్వైరీ నుంచి తప్పించేందుకు కోర్టుల్లో సవాల్ చేసిన ఆమె న్యాయవాదుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో నెక్ట్స్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలన్న దానిపై కవిత భర్త అనిల్, లాయర్లతో చర్చించినట్టు తెలుస్తోంది.