టీఎంసి అంటే ఎన్ని కోట్ల లీటర్లు…? క్యూసెక్ అంటే అర్ధం…?

తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ వరద ముంపు పొంచి ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఒక్క రోజులో రెండు లక్షల క్యూసెక్కుల వరద పెరిగింది. అటు గోదావరి వరద కూడా క్రమంగా పెరుగుతోంది. దీనితో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలిస్తుంది.

  • Written By:
  • Publish Date - September 8, 2024 / 02:02 PM IST

తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ వరద ముంపు పొంచి ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఒక్క రోజులో రెండు లక్షల క్యూసెక్కుల వరద పెరిగింది. అటు గోదావరి వరద కూడా క్రమంగా పెరుగుతోంది. దీనితో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలిస్తుంది. ఖమ్మంలో భారీ వర్షం పడటంతో మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజ్ కి కూడా భారీగా వరద వస్తోంది. ఇక బుడమేరుకి కూడా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తీవ్ర స్థాయిలో ఉంది. దీనిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది.

సరే… మనం ఎప్పటి నుంచో గోదావరి ఇన్ని లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది… దిగువకు ఇన్ని క్యూసెక్కులు విడుదల చేసారు. ప్రకాశం బ్యారేజ్ లో ఇన్ని టీఎంసిల నీరు నిల్వ ఉంది… అసలు ఈ టీఎంసీ… క్యూసెక్ అంటే అర్ధం చాలా మందికి తెలియదు. టీఎంసీ అంటే… థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్… అంటే వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగులు. రిజర్వాయర్లలో ఉన్న నీటి పరిమాణాన్ని టీఎంసిలలో కొలిచి చెప్తారు. అంటే ఒక టీఎంసి చెప్పాలంటే… 2881 కోట్ల లీటర్ల నీళ్ళు ఉండాలి. నిల్వ ఉండే నీటిని చెప్పే పద్దతిని టీఎంసి అంటారు.

2300 ఎకరాల విస్తీరణంలో నీరు చేరింది అంటే అది టీఎంసికి సమానం అవుతుంది. ఇక ప్రవహించే నీటి వేగాన్ని కొలవడానికి వాడే పద్దతిని క్యూసెక్ అని పిలుస్తారు. క్యూసెక్ అంటే ఒక సెకనుకు ఒక ఘనపు అడుగు అని అర్ధం వస్తుంది. దీని విలువ సెకనుకు 28 లీటర్ల నీళ్ళు. లక్ష క్యూసెక్కుల నీరు కిందకు విడుదల చేసారు అని చెప్తే… సెకను సమయంలో 28 లక్షల లీటర్ల నీళ్ళు కిందకు విడుదల అయినట్టు. ఇటీవల ప్రకాశం బ్యారేజ్ నుంచి వందేళ్ళ తర్వాత 11 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు.