Rishabh Pant: పంత్‌.. ది వారియర్.. బీసీసీఐ స్పెషల్ వీడియో

కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. చావు అంచుల దాకా వెళ్లి మళ్లీ కోలుకుని తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ప్రమాదం నుంచి పంత్‌ కోలుకున్న తీరు.. ఎందరికో స్పూర్తినిచ్చేలా ఉందంటూ ప్రశంసించింది.

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 02:35 PM IST

Rishabh Pant: రిషబ్‌ పంత్‌.. పరిచయం అవసరం లేని పేరు. ధోనీ తర్వాత క్రికెట్‌లో వికెట్‌ కీపర్‌‌గా, బ్యాట్స్‌మన్‌గా అద్భుతంగా రాణించిన ఆటగాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత విజయాలు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. మూడు ఫార్మాట్‌లలో నిలకడగా రాణిస్తూ.. భవిష్యత్‌ ఆశాకిరణంగా ప్రశంసలు అందుకున్న పంత్‌.. 2022, డిసెంబరు 31న జరిగిన కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు.

TDP SECOND LIST: టీడీపీ రెండో జాబితా విడుదల.. 34 మందికి టిక్కెట్లు

చావు అంచుల దాకా వెళ్లి మళ్లీ కోలుకుని తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ప్రమాదం నుంచి పంత్‌ కోలుకున్న తీరు.. ఎందరికో స్పూర్తినిచ్చేలా ఉందంటూ ప్రశంసించింది. ప్రమాదంలో దెబ్బతిన్న పంత్‌.. పడిలేచిన కెరటాన్ని మరిపిస్తూ మళ్లీ ఆడబోతున్నట్టు ప్రకటించింది. పంత్‌ కోలుకున్న తీరును వీడియోలో చూపించింది. అత్యున్నత చికిత్స అందించడంతో పంత్‌ వేగంగా కోలుకున్నాడు.

ప్రస్తుతం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో కసరత్తులు చేసి మళ్లీ ఫిట్‌నెస్‌ సాధించాడు. రానున్న ఐపీఎల్‌ ఎడిషన్‌లో పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నేతృత్వం వహించనున్నాడు. ఢిల్లీ టీం తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. మొహాలీలో జరిగే ఆ మ్యాచ్‌లో డీసీ టీమ్‌.. పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది.