Telangana elections : ఎన్నికల వేల పోలీసుల తనిఖీలు పట్టుబడుతున్న.. కోట్ల నగదు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల ద్వారా భారీ మొత్తంలో పోలీసులు బంగారం, స్వాధీనం.. నగరంలోకి వచ్చే ప్రతి వాహనం ను క్షుణ‌్ణంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు.. ఇప్పటివరకు ఎన్ని కోట్ల నగదు సాధ్వీనం చేసుకున్నారో తెలుసా..?

ఎన్నికలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఓటు అయితే.. తర్వాత గుర్తుకు వచ్చింది నోటు.. అవును నోటే. ఈ ఓటు ఎవరికి చేయాలని డిసైడ్ చేసిది వాడు ఇచ్చే నోటే కథా..అంతట ఇలా జరుగుతుంది అని చెప్పడం లేదు.. అంతటా ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. గతంలో ఇలా జరిగాయి కూడా. ఎన్నికలు అంటే నే BB పంచేస్తారు. BB అంటే బిగ్ బాస్ కాదండోయ్.. బీరు, బిర్యానీ అన్నమాట. తెలంగాణలో అక్టోబర్ 9 నుంచే ఎన్నికల కోడ్ అమ్మలోకి వచ్చింది. అంటే అధికారికంగా ఎన్నికల పండుగ మొదలైనట్లే మరి. అక్టోబర్ 9 నుంచి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రకారం.. రాష్ట్రంలో 89 అంతర్రాష్ట్ర, 169 రాష్ట్ర చెక్ పోక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏకంగా 100 కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల ద్వారా భారీ మొత్తంలో పోలీసులు బంగారం, స్వాధీనం చేసుకున్నారు. నగరంలోకి వచ్చే ప్రతి వాహనం ను క్షుణ‌్ణంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటివరకు ఎన్ని కోట్ల నగదు సాధ్వీనం చేసుకున్నారో తెలుసా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలైంది. ఓటర్స్ ను మెప్పించే పనిలో పడ్డారు నాయకులు. వారిని మెప్పించాలనే BB లేనిదే పని వారి హశిశులు పొందాలేవు. BB అనేది కేవలం వారి మాట వినేందుకు.. దాని తర్వాత అసలు భేరం మొదలైవుతుంది. దీని దృష్టిలో పెట్టుకోని రాష్ట్ర పోలీస్ యాత్రగాం నగర వ్యాప్తంగా కట్టదిట్టమైన ఏర్పాటు, ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ నెల తొమ్మిదో తేదీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు నిర్వహించిన తనిఖీలు ప్రారంభించారు. ఈ తనిఖీల్లో కేవలం రెండు రోజుల్లో సుమారు 20 కోట్లు రూపాయలు ఎలాంటి రిసిప్టు లేకుండా ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రూ. 37 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పడ్డబడ్డావిరిని సిఆర్‌పిసిలోని వివిధ సెక్షన్ల కింద 1196 మందిని అధికారులు అరెస్టు చేశారు.

మరో నాలుగు రోజుల్లో రూ.20.43 కోట్ల నగదు స్వాధీనం, 31.979 కిలోల బంగారం, 350 కిలోల వెండి స్వాధీనం, 42 క్యారెట్ల వజ్రాలు దాదాపు రూ.146.65 కోట్ల విలువైన నగదును లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్ర, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రూ.86.92 లక్షల విలువైన 31,370 లీటర్ల మద్యం, రూ.89 లక్షల విలువైన 310 కేజీల గంజాయి, ఏడు వేల కేజీల బియ్యం, 440 చీరలు, 80 కుట్టు మిషన్లు, 87 కుక్కర్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నాయి. నగరంలోని గచ్చిబౌలిలోని ఓ కాలనీలో ఎన్నికల వేళ కుక్కర్లు పంచుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ముంభర తనిఖీల్లో బుధవారం ఒక్కరోజే సరైన పత్రాలు లేని, సరిగ్గా లెక్కలు చూపని రూ. 2,47,30,500 నగదు, కేజీ 600 గ్రాముల బంగారం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో నగదును, బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు పోలీసులు.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ మొత్తంలో నగదు స్వాధీనం..

రంగారెడ్డి జిల్లా : చేవెళ్ల మండలం ధర్మసాగర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో రూ.18,39,500,

పురానాపూల్‌ : కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పురానాపూల్‌ చౌరస్తాలో నార్సింగికు చెందిన ఆనంద్‌ వ్యక్తి నుంచి ఆధారాలు లేని సుమారు 30 లక్షల విలువచేసే 600 గ్రాముల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు.

విజయనగర్‌ కాలనీ : గోల్కొండ టోలిచౌకీలోని అప్సర్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ అశ్వాక్‌ ద్విచక్రవాహనంలో రూ.6 లక్షలు ఉన్నట్లు మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్‌ పోలీసులు సీజ్.

చిక్కడపల్లి : నిర్మల్‌ జిల్లా బైంసా ప్రాంతానికి చెందిన శ్రీధర్‌ తన కారులో కేజీ బంగారం తీసుకువెళ్తుండగా గాందీనగర్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. రూ.58 లక్షల విలువైన ఆ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపిస్తే బంగారం ఇస్తాము అని లేని సమయంలో ఆదయా పన్ను శాఖ కు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు.

అంతారం స్టేజీ : సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.7.40 లక్షలు ,

కొత్తూరు బైపాస్‌, వై జంక్షన్‌ : వద్ద రూ.8.85 లక్షల నగదు సీజ్ 

అబ్దుల్లాపూర్‌మెట్‌ : పరిధిలో రూ. 5.11 లక్షల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరులో బ్యాంక్‌ ఉద్యోగి చీర్యాల సాయికుమార్‌ కారులో సరైన పత్రాలు నేని రూ. 45 లక్షలు సీజ్‌.

అనంతగిరి : సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తమ్మరబండపాలెం వద్ద ధాన్యం వ్యాపారి చింతకుంట్ల కోటేశ్వరరావుకు చెందిన కారులో రూ.7లక్షల 30వేలు స్వాధీనం.

చైతన్యపురి : సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి కొత్తపేట చౌరస్తాలో గోషామహల్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి సునీల్‌ జహంగీర్‌ నుంచి రూ. 7 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎలక్షన్స్.. రూ.40 కోట్లు పట్టివేత..

తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో జరుగుతున్న ఐటీ రైడ్స్ రూ.40 కోట్ల నగదు లభించడం కలకలం రేపుతోంది. మాజీ కార్పొరేటర్ బంధువు, కాంట్రాక్టర్ ఇంట్లో 23 అట్టపెట్టెల్లో ఈ డబ్బును అధికారులు గుర్తించారు. ఎన్నికల కోసం ఆ నగదును సమకూర్చినట్లు తెలుస్తుండగా.. చెన్నై మీదుగా హైదరాబాద్ తరలించాలని చూస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. రూ.40 కోట్ల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పుడే ఇలా ఉంటే మరీ నవంబర్ మొదటి వారంలో ఎన్ని కోట్లు, ఎన్ని మధ్యం బాలిల్స్ .. ఇలా ఇంకెన్ని పట్టుబడుతాయో. వేచి చూడాలి.

S.SURESH