Ladakh, Kargil, Earthquake : లడఖ్ లోని కార్గిల్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.2 గా నమోదు..

లడఖ్ ప్రపంచ అత్యంత సుందర ప్రదేశాల్లో ఇది ఒకటి.. మన దేశానికి తలమానికంగా ఉన్న లడఖ్ లో భూకంప సంభవించింది.

లడఖ్ ప్రపంచ అత్యంత సుందర ప్రదేశాల్లో ఇది ఒకటి.. మన దేశానికి తలమానికంగా ఉన్న లడఖ్ లో భూకంప సంభవించింది.

ఈ విషయంలోకి వెలితే.. లడఖ్ లోని కార్గిల్ సమీపంలో భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం రాత్రి సంభవించిన ఈ భూకంప కేంద్రం 10 కిమీ లోతులో ఉన్నట్లు పేర్కొంది.

లడఖ్ (Ladakh) : కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లోని కార్గిల్ (Kargil) జిల్లాలో సోమవారం రాత్రి భూకంపం సంభవించది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రధామిక సమాచారం మేరకు అదృష్టవశాత్తూ, ఎటువంటి ప్రాణ నష్టం జరిగినట్లు లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం, భూకంపం రాత్రి 9.35 గంటలకు సంభవించింద. దాని కేంద్రం కార్గిల్‌కు వాయువ్యంగా దిశగా 148 కిమీ దూరంలో గుర్తించారు. ప్రకంపనల లోతు ఉపరితలం నుంచి 10 కి.మీ. లో కేంద్రికృతం అయ్యి ఉన్నట్లు NCS గుర్తించింది.

 

“భూకంపం తీవ్రత: 5.2, 19-02-2024న సంభవించింది, 21:35:17 IST, లాట్: 35.45 & పొడవు: 74.93, లోతు: 10 కి.మీ ,స్థానం: 148 కి.మీ. NW కార్గిల్, X. లడ్డాలో పోస్ట్ చేయబడింది”

ఈ భూకంపం సంభవించి ప్రాంత స్థానిక ప్రజలను నుంచి.. విపత్తు నిర్వహణ బృందానికి ఎలాంటి అత్యవసర కాల్స్ రాలేదని వెల్లడించారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు విపత్తు నిర్వహణ బృందం గుర్తించింది.